ప్రిన్స్ మ‌హేష్‌కు దూర‌మైన మ‌రో ద‌ర్శ‌కుడు…!

August 19, 2019 at 5:39 pm

ప్రిన్స్ మ‌హేష్‌బాబుకు ఇప్పుడు బ్యాడ్ టైం న‌డుస్తున్న‌ట్లు ఉంది. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుపై నిర్మాతలు చాలా మంది అలిగి, పెట్టుబ‌డులు పెట్టెందుకు వెనుకంజ వేస్తున్న త‌రుణంలో ఇప్పుడు ద‌ర్శ‌కులు కూడా నిర్మాత‌ల బాటే ప‌డుతున్నారు. పెద్ద నిర్మాత దిల్ రాజు లాంటివారు ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో సినిమా నిర్మించ‌డం అంటే చాలా క‌ష్టం, న‌ష్టంతో కూడుకున్న‌ద‌ని గతంలో కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే…

అయితే నిర్మాత‌లు మ‌హేష్ బాబుతో సినిమా చేసేందుకు వెనుకాడుతున్న త‌రుణంలో ద‌ర్శ‌కులు కూడా వెనుకాముందు ఆడుతున్నారు. ఇటీవ‌ల ప్రిన్స్ మ‌హేష్‌బాబుపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ సంచ‌ల‌న కామెంట్లు చేసింది అందరికి తెలిసిందే. మహేష్‌బాబు కోసం త‌యారు చేసిన క‌థ‌ను ఇప్పుడు ఏకంగా రౌడీ హీరో అర్జున్‌రెడ్డి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేస్తున్నది తెలిసిందే.. ఇప్పుడు అదే అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన‌ డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఆ సినిమా ఘన విజయంగా నిలవడంతో సందీప్‌తో పని చేసేందుకు మహేష్ బాబు లాంటిస్టార్ హీరో ఆసక్తి చూపించాడు. దీంతో మహేష్ కోసం సందీప్ ఒక కథ రెడీ చేసి వినిపించాడు.

ఆ తర్వాత `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్`తో బిజీ అయిపోయాడు. ఆ సినిమా బాలీవుడ్‌లో కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో సందీప్‌ అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచే సందీప్‌కు చాలా అవకాశాలు వస్తున్నాయి. పెద్ద నిర్మాణ సంస్థలు సందీప్‌తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నాయి. మరోవైపు మహేష్ నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోవడంతో సందీప్ ఆ సినిమాను పక్కన పెట్టాడట. పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి కేంద్రీకరించాడట.

ప్రిన్స్ మ‌హేష్‌కు దూర‌మైన మ‌రో ద‌ర్శ‌కుడు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts