మెగాస్టార్ విష‌యంలో నాగ‌బాబు అసంతృప్తి…!!

August 23, 2019 at 12:33 pm

మెగాస్టార్ చిరంజీవి విష‌యంలో ఆయ‌న త‌మ్ముడు నాగ‌బాబు చాలా అసంతృప్తిగా ఉన్నాడ‌నే వార్త ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లో హాల్ ఛ‌ల్ చేస్తోంది. ఇంత‌కు త‌మ్ముడు అన్న విష‌యంలో ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడో అనే చ‌ర్చ మెగా అభిమానుల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. ఇంత‌కు సైరా సినిమాపైనా… లేక మ‌రేదైనా ఉందా అనే సందేహం ఉంది… అయితే మెగాస్టార్ కు జాతీయ స్థాయి ఉత్త‌మ న‌టుడి అవార్డు రాక‌పోవ‌డ‌మే ఆయ‌న అసంతృప్తికి కార‌ణ‌మ‌ట‌.. ఓస్ ఇంతేనా….

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి టాప్ హీరోనే. ఎంత గ్యాప్ తీసుకున్నా అయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు అనడంలో సందేహం అవసరం లేదు. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన నటుడు. దర్శకుడి కోరింది ఇవ్వడమే ఆయనకు తెలిసిన విద్య. కెరీర్లో 150 సినిమాలు చేశారు. ప్రస్తుతం 151 వ సినిమా చేస్తున్నాడు. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రజలు మెచ్చే ఎన్నో సినిమాలు చేశారు.. ఏంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. సామాజిక కార్యక్రమాలు చేయడంలో చిరంజీవి, అయన అభిమానులు ఎప్పుడు ముందు వరసలో ఉంటారు.

ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటి వరకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాకపోవడం బాధాకరమైన విషయమని చెప్పాలి. ఈ విషయంలో నాగబాబు అసంతృప్తిగా ఉన్నారట. రుద్రవీణ సినిమా సమయంలో మెగాస్టార్ కు ఈ అవార్డు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన ఇవ్వలేదని, చిరు 151 వ సినిమా సైరాతో అయినా మెగాస్టార్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావాలని కోరుకుంటున్నట్టు నాగబాబు పేర్కొన్నాడు. మరి సైరా సినిమాతోనైనా బాగబాబు కోరిక నెరవేరుతుందా.. చూడాలి.

మెగాస్టార్ విష‌యంలో నాగ‌బాబు అసంతృప్తి…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts