ఎన్టీఆర్‌కు జోడీగా దొరికిందోచ్‌…!!

August 21, 2019 at 3:38 pm

హ‌మ్మ‌య్య ఎట్ట‌కేల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు జోడీ దొరికింద‌ట‌… యంగ్ టైగ‌ర్‌కు దొరికిన జోడీ మ‌ళ్ళ తెల్ల‌పిల్లేన‌ట‌.. ఏదేమైనా ఎన్టీఆర్‌కు మ‌ల్లా తెల్ల‌పిల్ల‌తో జోడి కుద‌ర‌టంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నార‌ట‌. ఇంత‌కు ఎన్టీఆర్‌కు జోడీ దొర‌క‌డం దేనికి… ఇంత హంగామా దేనికి… యంగ్ టైగ‌ర్‌కు జోడీ కావాలంటే అంత ఆరాటం అవ‌స‌ర‌మా.. అనుకుంటే దొర‌క‌దా… అనుకునేరు… మ‌న డైరెక్ట‌ర్ ఎందులో కాంప్ర‌మైజ్ కాడుగా…

యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. చిత్రం ను ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు.. బాహుబ‌లి త‌రువాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీని దొర‌క‌బ‌ట్ట‌డం త‌ల‌కు మించిన భారంగా మారింద‌ట రాజ‌మౌళికి. ముందుగా రాజ‌మౌళి ఇంగ్లీష్ న‌టి డైసీ ఎడ్గ‌ర్‌ని తీసుకున్నారు… కానీ అనుకోని కార‌ణాల‌తో ఆమే ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది.. ఇక అప్ప‌టి నుంచి రాజ‌మౌళికి హీరోయిన్ క‌ష్టం మొద‌లైంది.

క‌థ డిమాండ్ మేర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ బామే కావాల‌ట‌. అందుకే ఇంత‌కాలం ఎంద‌రో ఇంగ్లీష్ హీరోయిన్ల‌ను వెతికాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ… కానీ ఎవ్వ‌రు అనుకున్న డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డం, వారికి కుద‌ర‌క‌పోవడం, స‌రైనోళ్ళు దొర‌క‌క‌పోవ‌డంతో ఎన్టీఆర్‌కు జోడీ దొర‌క‌బ‌ట్ట‌లేదు… చివ‌రాఖ‌రికి అయితే ఎట్ట‌కేల‌కు ఓ భామ‌ను దొర‌క‌బ‌ట్టాడ‌ట రాజ‌మౌళి. ఓ ఇంగ్లీష్ భామ‌ను దొర‌క‌బ‌ట్టిన రాజ‌మౌళి వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేద‌ట‌… మ‌రేమైనా తిర‌కాసు అయితే ఎట్లా అని గుబులు కాబోలు…

ఎన్టీఆర్‌కు జోడీగా దొరికిందోచ్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)