దుమ్మురేపుతున్న ప‌వ‌న్ సైరా…!

August 19, 2019 at 2:31 pm

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. కొద్ది సేప‌టి క్రిత‌మే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరాకు అందించిన వాయిస్ ఓవ‌ర్‌లోని సైరా న‌ర‌సింహారెడ్డి అని నిన‌దించే వీడియోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి చిత్రం టీజ‌ర్‌ను ఈనెల‌20న విడుదల చేయ‌నున్న నేప‌థ్యంలో సినిమాపై హైప్ పెంచేందుకు, టీజ‌ర్‌కు ఊపు తెచ్చేందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్ తో కూడిన వీడియోను విడుద‌ల చేశారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న చిరంజీవి స‌మ‌క్షంలోనే రికార్డింగ్ స్టూడియోలో సైరా న‌ర‌సింహారెడ్డి అంటూ నిన‌దించిన వీడియోను రూపొందించారు.

సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం టీజ‌ర్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డ‌బ్బింగ్ చెప్పినట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే వీటిని నిజం చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ త‌న అధికారిక ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంతో ఆవేశంగా చెప్పిన సైరా న‌ర‌సింహారెడ్డి అనే డైలాగ్‌ను వ‌దిలారు. ఇది కేవ‌లం శాంపిల్ గానే చూపిన‌ట్లుగా చూపారు. భ‌విష్య‌త్‌లో సినిమాపై భారీ హైప్‌ను క్రియోట్ చేయ‌నున్నార‌ట చిత్ర బృందం

దుమ్మురేపుతున్న ప‌వ‌న్ సైరా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts