చిరు ,చరణ్ ,ప్రభాస్ ఒక్క‌టైన వేళ‌…!

August 20, 2019 at 10:01 pm

టాలీవుడ్‌లో ఇప్పుడు తిరుగులేని హీరోలు.. నాటి త‌రంకు తిరుగులేని హీరో మెగాస్టార్ చిరంజీవి.. నేటి త‌రంలో ఎదురేలేని హీరోలు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌… ఈ ముగ్గురు ధీరులు ఒక్క‌టయ్యారా…! త్రిమూర్తులు క‌లిసి ఓ ఫోటో దిగడం అటు మెగా అభిమానుల‌కు, ఇటు రెబ‌ల్‌స్టార్ అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయింది…

ఇంత‌కు ఈ ముగ్గురు టాలీవుడ్ స్టార్లు ఎక్క‌డ క‌లిసారు.. ఎందుకు క‌లిసారు… ఏమిటి విశేషం… వీరు ముగ్గురు మొన‌గాళ్ళు క‌లిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా… అనే ప్ర‌శ్న‌లు ఒక‌దాని వెంట ఒక‌టి వ‌స్తున్నాయి. అయితే ఈ ముగ్గురు క‌లిసింది కేవ‌లం యాదృచ్చికమేన‌ట‌. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం టీజ‌ర్‌ను ఈరోజు ముంబాయ్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంలో ఈ ముగ్గురు క‌లుసుకున్నారు…

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ముంబాయ్‌లో విడుద‌ల చేసేందుకు మెగాస్టార్ చిరు, రామ్ చ‌ర‌ణ్ తేజ్‌లు వెళ్ళారు.. ఇక సాహో ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప్ర‌భాస్ ముంబాయ్‌లోనే మాకాం వేశాడ‌ట‌. అయితే సైరా టీజ‌ర్ విడుద‌ల‌కు వ‌చ్చిన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తేజ్‌ను ప్ర‌భాస్ క‌లిసాడు. కొస‌మెరుపు ఏంటంటే… అల్లూరి సీతారామారాజు, సైరా న‌ర‌సింహరెడ్డి, సాహో ఒక్క‌ద‌గ్గ‌ర క‌లువ‌డం.

చిరు ,చరణ్ ,ప్రభాస్ ఒక్క‌టైన వేళ‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts