సాహో… ఒత్తిడిలో ప్ర‌భాస్‌…!!

August 21, 2019 at 10:57 am

దేశ వ్యాప్తంగా ఇప్పుడు సిని ప్ర‌పంచంలో మార్మోగుతున్న చిత్రాల్లో సాహో, సైరా సినిమాల జోరే ఉంది. సాహో సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వ్వ‌గా, సైరా సినిమా ఇప్పుడే ప్ర‌మోష‌న్ లెవ‌ల్‌ను ప్రారంభించింది. అయితే సాహో సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌లో గుబులు పుడుతుంద‌ట‌… సాహో సినిమా ప్ర‌భాస్‌ను ఒత్తిడిలోకి నెడుతుంద‌ట‌…

ఇంత‌కు సాహో మానియా దేశ వ్యాప్తంగా సాగుతున్న త‌రుణంలో ప్ర‌భాస్‌లో భ‌యం, ఒత్తిడి, వ‌ణుకు, గుబులు ఎందుకో అనే క‌దా మీ డౌట్‌.. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బాహుబ‌లి కోసం ఐదేండ్లు ప‌నిచేశాడు.. ఆ సినిమా క‌నివిని ఎరుగ‌ని రీతిలో చిత్ర సీమ‌నే షేక్ చేసింది. ఏకంగా బాలీవుడ్ పునాదుల‌నే క‌దిలించేసింది. ఆదే ఊపులో ఇప్పుడు ప్ర‌భాస్ సాహో సినిమాలో న‌టించాడు.

సాహో సినిమా వావ్ అనే తీరుగా ముందుకు సాగిపోతుంది. సాహో ఈనెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానున్న‌ది. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రంగానే సాగుతున్నాయి. అయితే ఇక్కడే సాహో ప్ర‌భాస్‌కు గుబులు, భ‌యం ప‌ట్టుకున్నాయ‌ట‌. ఒత్తిడికి కూడా గుర‌వుతున్నాడ‌ట‌… ఎందుకంటే భ‌విష్య‌త్‌లో మ‌ళ్ళీ బాహుబ‌లి, సాహో అంత రేంజ్ ఉన్న సినిమాలు చేయ‌గ‌ల‌నా.. లేదా అనే గుబులు ప‌ట్టుకుంద‌ట‌… ఈ రెండు సినిమాల‌తో ఓ రేంజ్‌లోకి వెళ్ళితే మ‌ళ్ళీ ఆ రేంజ్‌లో సినిమాలు లేక‌పోతే.. భ‌విష్య‌త్ గంద‌ర‌గోళంగా మారుతుంద‌ట‌.. ఇక సాహో సినిమా హైప్ ఇస్తుంది కాకుంటే ఏదైనా తేడా కొడితే ప‌రిస్థితి ఆధఃపాతాళంలోకి జారీపోవ‌డం ఖాయ‌మ‌నే భ‌యం ప‌ట్టుకుంద‌ట‌… సో ప్ర‌భాస్ ప‌రిస్థితి ఈనెల‌30తో తేలిపోనున్న‌ద‌ట‌…

సాహో… ఒత్తిడిలో ప్ర‌భాస్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)