విజ‌య్ – పూరి సినిమా టైటిల్ వ‌చ్చేసింది…!

August 22, 2019 at 2:27 pm

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత‌ ఐ యామ్ బ్యాక్ అని నిరూపించుకున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే రూ.40 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసేసింది. కేవ‌లం రూ.17 కోట్ల‌కు అమ్మిన ఇస్మార్ట్ శంక‌ర్ డ‌బుల్‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ హిట్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు పూరి కొత్త సినిమాపై ఎనౌన్స్ మెంట్ కూడా చేసేశాడు.

ఇటీవ‌ల డియ‌ర్ కామ్రేడ్‌ సినిమాతో నిరాశ‌ప‌రిచిన‌ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో త‌న నెక్ట్స్ సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ సినిమాను పూరి – చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కూడా నిర్ణయించేశారని ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త.

పూరి ఈ సినిమాకు ఫైట‌ర్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లోనే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు
ఫైటర్ టైటిల్ చాలా బాగుంటుందని భావిస్తున్నాడట. ఈ డిసెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్లే ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్లు, ఇత‌ర తారాగ‌ణం ఎంపిక‌లో పూరి బిజీ అయిపోయారు.

విజ‌య్ – పూరి సినిమా టైటిల్ వ‌చ్చేసింది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts