రాజ్ తరుణ్ కు రోడ్ ప్రమాదం …కారు వదిలి పారిపోయిన హీరో !

August 20, 2019 at 2:11 pm

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం రాజ్ త‌రుణ్ త‌న ప‌నుల నిమిత్తం కారులో ప్ర‌యాణిస్తుండగా కారు ఓఆర్ఆర్ నార్సింగి స‌మీపంలో అదుపు త‌ప్పి ప్ర‌మాదంకు గురైంద‌ట‌. దీంతో రాజ్ త‌రుణ్ కు ప్ర‌మాదం జ‌రిగింది. ఇంత‌కు కారును డ్రైవ‌ర్ న‌డుపుతున్నాడా… లేక త‌రుణే స్వ‌యంగా డ్రైవింగ్ చేస్తున్నాడా అన్న‌ది తెలియ‌లేదు..

రాజ్ త‌రుణ్ కారు నార్సింగ్ స‌మీపంలోని అల్కాపూర్ వ‌ద్ద అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను డీ కొట్టింద‌ట‌. అయితే ఈ ప్ర‌మాదంలో రాజ్ త‌రుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని తెలిసింది. ప్ర‌మాదంలో కారు డ్యామెజీ కావ‌డంతో కారును అక్క‌డే వ‌దిలేసి పారిపోయాడని సీసీ వీడియో ద్వారా తెలుస్తుంది . రాజ్ త‌రుణ్‌కు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్ప‌టికే ఎంద‌రో టాలీవుడ్ న‌టులు, సాంకేతిక నిపుణులు ఇలా రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోయారు. టాలీవుడ్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడైన నందమూరి హ‌రికృష్ణ కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. అదే విధంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌మ్ముడు కూడా ఇలాగే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. ఎంద‌రో న‌టుల‌ను రోడ్డు ప్రమాదాల రూపంలో టాలీవుడ్‌కు దూర‌మ‌య్యారు.

రాజ్ తరుణ్ కు రోడ్ ప్రమాదం …కారు వదిలి పారిపోయిన హీరో !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts