ర‌ణ‌రంగం మేకింగ్ వీడియో రిలీజ్‌…!

August 14, 2019 at 5:00 pm

యువ హీరో శర్వానంద్‌, కల్యాణీ ప్రియదర్శన్ప్ర‌, కాజల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం ర‌ణ‌రంగం. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కించిన ర‌ణ‌రంగం చిత్రం. పీవీపీ సంస్థ అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ర‌ణ‌రంగం చిత్రం మేకింగ్ వీడియోను కొద్ది సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ర‌ణ‌రంగం చిత్రంలో శ‌ర్వానంద్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టిస్తుండ‌గా, కాజల్‌ అగర్వాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించ‌గా, ఇటీవ‌ల సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది . స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

1980 బ్యాక్‌డ్రాప్‌ నుంచి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. సినిమాలో శర్వానంద్‌ రెండు భిన్న పాత్రల్లో అలరించ‌నున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ సైరా సినిమాకు పోటీగానే అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇందులో సినిమాకి సంబంధించి కొన్ని కీలక స‌న్నివేశాల మేకింగ్ చూపించారు. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.

ర‌ణ‌రంగం మేకింగ్ వీడియో రిలీజ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts