డిస్కోరాజా ను చూసారా…!!

August 24, 2019 at 4:43 pm

మాస్ మహారాజా ర‌వితేజ‌… రాజా ది గ్రేట్‌తో విజ‌యాల బాట ప‌ట్టిన ర‌వితేజ ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాల‌పైనే దృష్టి నిలిపాడు. అయితే పేరుకు మాత్ర‌మే మాస్‌.. కానీ నేను కూడా క్లాస్‌గా ఉంటానంటున్నాడు ఈ హీరో… ప్ర‌స్తుతం ఈ మాస్ మ‌హారాజా డిస్కోరాజా అంటూ అభిమానుల‌ను ఆడించ‌బోతున్నాడు… అయితే ఈ మాస్ మ‌హారాజా కొత్త‌లుక్ ఇప్పుడు బ‌య‌టికొచ్చింది.

హీరో ర‌వితేజ ఇంత‌కాలం మాస్‌గా క‌నిపించేవాడు. అయితే ఇటీవ‌ల డిస్కోరాజాతో ర‌వితేజ క్లాస్‌రాజాగా మార‌బోతున్నాడు… ఇందుకు సంబంధించిన ఓ యంగ్‌లుక్‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఇంత‌కు మాస్‌మ‌హారాజా ఎలా ఉన్నాడో ఓసారి చూస్తే ఈసినిమా లో ర‌వితేజ పాత్ర ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంది.

ఎక్క‌డికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు ర‌వితేజ‌. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అన్నారు. ర‌వితేజ స‌ర‌స‌న న‌భాన‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా, వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ మ్యూజిక్. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు.

డిస్కోరాజా ను చూసారా…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts