సాహో బాడ్ బాయ్ సాంగ్ ప్రోమో రిలీజ్

August 19, 2019 at 3:51 pm

సాహో సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది చిత్ర ప్ర‌మోష‌న్‌పై దృష్టి పెట్టింది. అయితే సాహో సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక‌ల‌ను రామోజీ ఫిలిం సిటిలో ఆదివారం నిర్వ‌హించిన చిత్ర‌బృందం. ఇప్పుడు సాహో సినిమాలోని మూడో పాట‌ను విడుద‌ల చేసి సినిమా ప్ర‌మోష‌న్‌ను భారీగానే చేప‌ట్టినట్లు అర్థ‌మ‌వుతుంది.

సాహో సినిమాను రూ.350కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించిన త‌రుణంలో చిత్రంలో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ల‌కు తెర‌తీసింది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో భారీ యాక్ష‌న్ సీన్ల‌ను విడుద‌ల చేసి చిత్రంపై భారీ అంచ‌నాల‌ను పెంచి భారీ బిజినెస్ చేసుకుంటున్న త‌రుణంలో ఇప్పుడు మూడో పాట‌ను భారీగానే విడుద‌ల చేసింది.

సినిమా మొత్తం యాక్ష‌న్ సీన్ల‌తో ప్రేక్ష‌కుల‌కు బోరు కొట్ట‌కుండా ఉండేందుకు కేవ‌లం మూడు పాట‌ల‌నే పెట్టార‌ట‌. ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మూడో పాట‌ను విడుద‌ల చేసింది. ఈ పాట‌ను మోడ‌ల్స్ న‌డుమ సాహో ఆడిపాడుతున్న తీరును తెర‌కెక్కించాడు. రెండు పాట‌ల‌ను సినిమా హీరోయిన్ శ్ర‌ద్దాక‌పూర్‌పై చిత్రించ‌గా, ఈ పాట‌ను శ్రీ‌లంక బ్యూటీ జాక్విలిన్‌పై చిత్రీక‌రించారు. ప్ర‌భాస్ శ్రీ‌లంక బ్యూటీతో మూడో పాట `బ్యాడ్ బోయ్.. `ను అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు.

సాహో బాడ్ బాయ్ సాంగ్ ప్రోమో రిలీజ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts