అక్కడ స్పైడ‌ర్‌ను దాట‌లేక పోయిన సాహో …!!

August 31, 2019 at 12:18 pm

యూఎస్‌లో బాహుబ‌లి వీరుడిగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు క‌నీసం స్పైడ‌ర్‌ను కూడా దాట‌లేక‌పోతున్నాడు. అస‌లే అత్తెస‌రు క‌లెక్ష‌న్లో స్పైడ‌ర్ ఐదో స్థానంలో ఉంటే సాహో తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రంగంలోకి దూకిన ప్ర‌భాస్ ఆరో స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.. అమెరికాలో ప్ర‌భాస్‌కు భారీగా అభిమాన గ‌ణం ఉంది. కానీ అక్క‌డ సాహో సినిమా అట్ట‌ర్ ప్లాఫ్ దిశ‌గా వెళుతుంది.

భారీ బ‌డ్జెట్‌తో భారీ అంచనాల మధ్య రిలీజైన సాహో సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉంటాయో.. యూఎస్ ప్రీమియర్ షో కలెక్షన్ల విషయంలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అనుకున్నారు. సినిమాకు వచ్చిన హైప్ ను దృష్టిలో పెట్టుకొని యూఎస్ లో టికెట్ ధరలు అమాంతం పెంచేశారు. తీరా సినిమాకు నెగెటివ్ టాక్ రన్ కావడంతో కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రికార్డులను కొల్లగొడుతుంది అనుకున్న సాహో మహేష్ బాబు కెరీర్లో ఒక డిజాస్టర్ గా నిలిచిన స్పైడర్ వసూళ్లను కూడా దాటలేకపోయింది.

స్పైడర్ ప్రీమియర్ ద్వారా మిలియన్ డాలర్లు వసూలు చేస్తే.. సాహో మాత్రం 915వేల డాలర్ల దగ్గర ఆగిపోయింది. ప్రీమియర్ ద్వారా అత్యధిక వసూలు చేసిన సినిమాల విషయంలో సాహో ఆరోస్థానంలో నిలిచింది. బాహుబలి 2 సినిమా 2.4 మిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో ఉంటె, అజ్ఞాతవాసి 1.52 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో బాహుబలి 1, నాలుగో స్థానంలో ఖైదీ నెంబర్ 150, ఐదో స్థానంలో స్పైడర్ సినిమాలు ఉన్నాయి. సో సాహో సినిమా అమెరికాలో ఇంత చెత్త సినిమా తీసాడెంట‌బ్బా అని నిట్టూర్చుతున్నార‌ట ప్రేక్ష‌కులు, అభిమానులు.

అక్కడ స్పైడ‌ర్‌ను దాట‌లేక పోయిన సాహో …!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts