అరుదైన గౌరవం ద‌క్కించుకున్న సాహో…!!

August 23, 2019 at 11:38 am

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ సాహో, బాలీవుడ్ బామ శ్ర‌ద్దాక‌పూర్ క‌లిసి జంట‌గా న‌టిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమా ఇప్ప‌టికే అనేక రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుండ‌గా, ఇప్పుడు మ‌రో అరుదైన గౌర‌వాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ సినిమాలో సాధ్య‌మైన ఈ గౌర‌వాన్ని ఓ టాలీవుడ్ సినిమా ఆ గౌర‌వం పొంద‌టం అంటే మాట‌లు కాదు… ఇదే మొద‌టి సినిమా అని కూడా తెలుస్తుంది. ఇంత‌కు సాహో సినిమా ద‌క్కించుకున్న ఆ అరుదైన గౌరవం ఏంటో అనే ఉత్సుక‌త అభిమానుల్లో ఉంది.

సాహో సినిమా ఈనెల 30వ తేదీన విడుద‌ల‌ కాబోతున్నది. సినిమాపై అంచనాలు ఇప్ప‌టికే భారీగా ఉన్నాయి. హైయాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొన్ని సినిమాల కోసం ఎమోజీలను తయారు చేస్తుంది. ఎవెంజర్స్, ది లయన్ కింగ్, స్పైడర్ మాన్, బాలీవుడ్ సినిమా భారత్ సినిమాలకు ఆ గౌరవం దక్కింది. సాహో సినిమా కోసం కూడా ట్విట్టర్ ఎమోజిని తయారు చేసింది. ఇలా ఎమోజి పొందిన మొదటి తెలుసు సినిమా సాహో కావడం విశేషం.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమాలో శ్ర‌ద్దా కపూర్ తో పాటు శ్రీ‌లంక బ్యూటీ కూడా న‌టిస్తుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ను సుమారు 330కోట్ల‌కు పైగా చేసింది. ఫ్రీ రిలిజ్ బిజినెస్ విషయంలోనూ ఈ మూవీ రికార్డును సాధించింది. అదే విధంగా బ్యాడ్ బాయ్ పాట కూడా నెట్టింట్లో హాల్‌ఛ‌ల్ చేస్తోంది.

అరుదైన గౌరవం ద‌క్కించుకున్న సాహో…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts