బ‌న్నీ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ …!!

August 23, 2019 at 11:28 am

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ సినిమాలో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నాడా…? ఇది మెగా అభిమానుల‌కు పండులాంటి వార్తే… ఇది ఎంత‌వ‌ర‌కు నిజం… అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో ఇప్పుడిప్పుడే మెగాహీరోగా రాణిస్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి న‌టించ‌డం ఏంట‌నే అనుమానం రాకత‌ప్ప‌దు… అయితే ఇది నిజ‌మేన‌ట‌.. కాకుంటే బ‌న్నీతో క‌లిసి ఓకే సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌డం లేద‌ట కానీ… బ‌న్నీ కోసం త‌యారు చేసిన క‌థ‌తో సాయిధ‌ర‌మ్ తేజ్‌ సినిమా చేస్తున్నాడ‌ట‌…

సో క‌జిన్ బ్ర‌ద‌ర్స్ అయిన వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తే చూడాల‌నుకున్న‌వారికి ఈ వార్త నిజ‌మైతే బాగుండ‌నిపించినా, కేవ‌లం క‌థేనా అనుకుని నిరూత్స‌ప‌డాల్సిన ప‌నిలేదు…అది కూడా ఏదో ఒక‌రోజు జ‌రుగొచ్చు… వేచిచూద్దాం…అప్ప‌టి దాకా ఈ క‌థ ఎంతో చూద్దాం..ఇండస్ట్రీ లో ఒకరితో చేద్దాం అనుకున్న మూవీ..మరొకరి చేతుల్లోకి వెళ్లడం కామన్.. నా పేరు సూర్య తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో బన్నీ దగ్గరకు సుబ్బు అనే నూతన డైరెక్టర్ ఓ కథ చెప్పాడట. అది బాగా నచ్చడం తో చేద్దామని బన్నీ అనుకున్నాడట. కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ ఓ స్టోరీ లైన్ చెప్పడం..అది బాగా నచ్చడం..వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లడం చక చక జరిగిపోయాయి.

ఇప్పుడే అదే కథ ను సుబ్బు తేజ్ కు వినిపించాడట. తేజ్ కూడా ఓకే చెప్పడం..ఈ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో విరించి వర్మ తదితరుల దగ్గర సుబ్బు పనిచేసాడు.అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాకు డైలాగ్ వెర్షన్ ఇతగాడిదే అని కూడా తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో నాభ నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ప్రస్తుతం తేజ్ మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.

బ‌న్నీ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ …!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts