విషాదంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి

August 22, 2019 at 11:36 am

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం అర్జున్‌రెడ్డి. ఈ చిత్రం ద‌ర్శ‌కుడు వంగ సందీప్‌రెడ్డి ఈ సినిమా రూపొందించిన సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి త‌ల్లి వంగ సుజాత క‌న్నుమూశారు. గురువారం తెల్ల‌వార‌జామున ఆమే క‌న్నుమూసిన‌ట్లు అన్నారు.

అర్జున్‌రెడ్డి చిత్రం తో సందీప్‌రెడ్డి ఒక్క‌సారే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా మారాడు. ఇదే సినిమాను హిందిలో క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో క‌నివిని ఎరుగ‌ని రీతిలో విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు సందీప్‌రెడ్డి.

ద‌ర్శ‌కుడు వంగ సందీప్‌రెడ్డిది స్వ‌గ్రామం వ‌రంగ‌ల్‌. ఆయ‌న త‌ల్లి సుజాత వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలోని మ‌ర్రి వెంక‌ట‌య్య కాల‌నీలోని స్వ‌గృహంలో తుది శ్వాస విడిచారు. ఆమే మృతితో ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి నివాసంలో విశాద చాయ‌లు అలుముకున్నాయి. సుజాత మృతికి నివాళి ఆర్పించారు.

విషాదంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts