ర‌ణ‌రంగం ఎస‌రు పెట్టింది.. ఎవ‌రు…!!

August 19, 2019 at 3:04 pm

ఇద్ద‌రు యువ హీరోలు… ఒక‌రు వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతున్న హీరో… మ‌రొక‌రు అడ‌పాద‌డ‌పా చిత్రాల‌ను చేసుకుంటూ ముందుకు పోతున్న హీరో.. కానీ ఇద్ద‌రి సినిమాలు పంద్రాగ‌స్టు రోజునాడే విడుద‌లై పోటాపోటీగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతాయ‌ని అనుకున్నారంతా… కానీ ఈ ఇద్ద‌రు యువ‌హీరోల్లో ఒక‌హీరో ఫ‌ల్టీకొట్ట‌గా, ఒక హీరో దూసుకుపోతున్నాడు.. ఇంత‌కు ఇద్ద‌రు హీరోల్లో దూసుకుపోతున్న హీరో ఎవ‌రు…? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

యువ‌హీరో శ‌ర్వానంద్ న‌టించి చిత్రం ర‌ణ‌రంగం. మ‌రో యువ‌హీరో అడివి శేషు న‌టించిన చిత్రం ఎవ‌రు. రెండు చిత్రాలు పోటాపోటీగా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు విడుద‌ల చేసుకుని దూకుడు పెంచారు. పంద్రాగ‌స్టు రోజున బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ్డారు. కానీ విడుద‌ల అయిన మొద‌టి రోజున బాక్సాఫీస్ వ‌ద్ద ఢీ అంటే ఢీ అనుకున్న ఈ చిత్రాలు నాలుగు రోజుల్లోనే ఓ హీరో సినిమా వెనుక‌ప‌ట్టు ప‌డుతుంది.

శ‌ర్వానంద్ న‌టించిన చిత్రం ర‌ణ‌రంగం ట్రైల‌ర్‌తో వ‌చ్చిన ఊపును ఇప్పుడు కొన‌సాగించ‌లేక పోతున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం ఎవ‌రు మాత్రం వ‌సూళ్ళ‌లో దూసుకుపోతుంది. ర‌ణ‌రంగం మాత్రం వ‌సూళ్ళ‌లో దూసుకుపోలేక చ‌తికిల ప‌డింద‌నే టాక్ వినిపిస్తుంది. ఆదివారం నాటి క‌లెక్ష‌న్లు చూస్తేనే ర‌ణ‌రంగం రంగం నుంచి త‌ప్పుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఎవ‌రు సినిమా ఆదివారం నైజాం ఏరియాలో 60ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. నాలుగు రోజుల‌కు రూ.2.30కోట్లు షేర్ రాబ‌ట్టింది. ర‌ణ‌రంగం నాలుగు రోజుల‌కు కేవ‌లం రూ.1,94కోట్లు వ‌సూలు చేయ‌గా, ఆదివారం మాత్రం రూ.25లక్ష‌లు మాత్ర‌మే వ‌సూలు చేసుకుంది… సో ఎవ‌రును ర‌ణ‌రంగం త‌ట్టుకోలేక‌పోతుందనే టాక్‌.

ర‌ణ‌రంగం ఎస‌రు పెట్టింది.. ఎవ‌రు…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts