శ్రీ‌క‌రంలో శ‌ర్వా రోల్ తెలుసా…!!

August 24, 2019 at 5:30 pm

టాలీవుడ్ యువ‌హీరో శ‌ర్వానంద్ ఇటీవ‌ల న‌టించిన చిత్రం రణరంగం. ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా అలరించారు శర్వానంద్. ఆయన ప్రస్తుతం సమంత జోడిగా తెరకెక్కుతున్న96 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 50 శాతానికిపైగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న‌ది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో పూర్తి చేసుకున్న త‌రువాత మ‌రో చిత్రానికి ఆయ‌న షిప్ట్ కానున్నాడ‌ట‌.

అయితే త‌దుపరి శర్వానంద్‌ ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నారు. శతమానం భవతి మూవీ తరహాలో సాగే ఈ చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో త‌దుప‌రి చిత్రం నిర్మాణం ఉంటుంద‌ట‌. ఈసినిమాకు శ్రీకరం అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, కిషోర్ రెడ్డి నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అయితే ఈ చిత్రంలో శర్వానంద్ ఇంట్రేస్టింగ్ క్యారెక్ట‌ర్ పోషించ‌బోతున్నాడ‌ట‌. శ‌ర్వానంద్ రైతుగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. శ‌ర్వానంద్ న‌టించ‌బోయే రైతు పాత్ర ప‌ట్ల సిని వర్గాలలో విశేషంగా వినిపిస్తున్న వార్త. ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రలు చేసే శర్వా మొదటిసారి రైతుగా కనిపించనున్నారని తెలుస్తుంది. మ‌హ‌ర్షి సినిమాలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు మాదిరిగా రైతు పాత్ర పోషించ‌న‌ట్లుగా శ‌ర్వానంద్ కూడా రైతుల‌గా న‌టించ‌బోతున్నాడన్న మాట‌.

శ్రీ‌క‌రంలో శ‌ర్వా రోల్ తెలుసా…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts