సైరా టీజ‌ర్…చ‌రిత్ర మ‌న‌తోనే మొద‌ల‌వ్వాలి

August 20, 2019 at 3:37 pm

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. మెగాస్టార్ త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నుండి నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసింది.

ఓ స్వాతంత్య్ర స‌మ‌రయోధుడి జీవిత చ‌రిత్ర‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని తెర‌కెక్కిస్తున్న సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం టీజ‌ర్‌పై ఓ లుక్కేద్దాం. టీజ‌ర్‌లో చిరంజీవి బ్రిటీష్ పాల‌కుల‌పై ప్ర‌తికారం తీర్చుకుని స్వాతంత్య్రం కోసం చేసిన పోరు దృశ్యాల‌ను చూపారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్‌తో టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఆనాటి వీరుల‌ను స్మ‌రిస్తూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ టీజ‌ర్‌కే హైలేట్‌గా నిలిచింది.

సింహాం లాంటోడు దొర అత‌డే వాళ్ళ దైర్యం దొర అనే డైలాగ్‌లు.. చరిత్ర‌లో మ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు…కానీ చ‌రిత్ర మ‌న‌తోనే మొద‌ల‌వ్వాలి అనే డైలాగ్ చిరు నోటి నుంచి వెలువ‌డి పోరాట ప‌టిమ‌ను చూపాయి. చరిత్ర గురించి చిరంజీవి చేసిన కామెంట్లు సినిమాలో బాగా పేలాయ‌నే చెప్ప‌వ‌చ్చు. టీజ‌ర్‌లో చిత్రంలో రాజ‌గురువుగా న‌టిస్తున్న బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ తో పాటు భారీ కాస్టింగ్‌తో తీసిని చిత్రాల‌ను విడుద‌ల చేసింది.

సైరా టీజ‌ర్…చ‌రిత్ర మ‌న‌తోనే మొద‌ల‌వ్వాలి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts