‘ సైరా ‘ దెబ్బ‌తో సీనియ‌ర్ హీరోకు భ‌యం ప‌ట్టుకుందా…!

August 17, 2019 at 10:09 am

సైరా మేకింగ్ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో ఆ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలు డబుల్ కాదు ఏకంగా ట్రిపుల్ అయిపోయాయి. సైరా ఎప్పుడో దసరా కానుకగా అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. వెంకటేష్ – నాగచైతన్య మల్టీ స్టారర్ సినిమా వెంకీ మామ కూడా సైరాతో పోటీకి సై అంటూ అక్టోబర్ 4న రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం దసరా బ‌రి నుంచి వెంకీమామ అవుట్ అయినట్టు తెలుస్తోంది.

అయితే వెంకీమామ టీం మాత్రం వెంకటేష్ గాయ‌ప‌డ‌డంతోనే వెంకీమామ సినిమా వాయిదా వేసిన‌ట్టు చెబుతున్నా అసలు కారణం మాత్రం సైరా మేకింగ్ వీడియో చూసి… ఇంత భారీ సినిమాతో పోటీకి వెళ్లి రిస్క్ చేయ‌డం కంటే సోలోగా రావడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశార‌ని తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వెంకీకి త‌గిలింది పెద్ద గాయం కాద‌న్న యూనిట్ ఇప్పుడు మాట మార్చేసింది. ఇప్ప‌ట్లో వెంకీ షూటింగ్‌కు రావ‌డం కూడా క‌ష్ట‌మే అన్న‌ట్టు చెపుతున్నారు.

ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్ ప్ర‌కారం సైరా మేకింగ్ చూశాక‌… ఆ సినిమాకు పోటీగా వెళ్లాలంటేనే వెంకీమామ టీం భ‌య‌ప‌డుతోంద‌ట‌. ఈ సినిమాకు రూ.50 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ అయ్యిందంటున్నారు. అంత మొత్తం రిక‌వ‌రీ కావాలంటే సోలోగా బెట‌ర్ అన్న‌ది సురేష్ బాబు డెసిష‌న్‌. సురేష్‌బాబు బిజినెస్ ట్రిక్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ బేబీ సినిమాకు కూడా ఆయన చాలా ప్లాన్ వేసి, అన్నీ జాగ్రత్తపడి సోలో డేట్ తెచ్చుకుని గట్టెక్కారు. అందుకే ఇప్పుడు వెంకీమామ‌ను కూడా సోలోగా తీసుకు రావాల‌న్న‌దే ఆయ‌న ప్లాన్‌.

‘ సైరా ‘ దెబ్బ‌తో సీనియ‌ర్ హీరోకు భ‌యం ప‌ట్టుకుందా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts