సైరా అంతా ఓకే… కానీ కొంచెం తేడా…!!

August 21, 2019 at 10:49 am

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం సైరా.. సినిమా షూటింగ్ పూర్తి అయింది… నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను వేగంగా జ‌రుపుకుంటుంది.. ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్‌పై దృష్టి సారించింది సైరా టీం. అందులో భాగంగా ఈనెల‌20 టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.. ఈ టీజ‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రికి ఓ చారిత్రాత్మ‌క‌మైన చిత్రం తెర‌కెక్కింది అనేలా ఉంద‌నే టాక్ వినిపిస్తుంది.. విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంసించేలా చిత్ర టీజ‌ర్ ఉంది..

టీజ‌ర్‌ను ప్రేక్ష‌కులు, అభిమానులు బాగానే ఆదిస్తున్నారు.. కాకుంటే సినిమాలో ఏదో తేడా కొడుతుంద‌నే టాక్ మాత్రం అక్క‌డ‌క్క‌డా వినిపిస్తుంది… బాహుబ‌లి రేంజ్‌లో సినిమా క‌నిపిస్తుంది.. సినిమాలో వేసిని సెట్టింగ్‌, విజువ‌ల్‌, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ చూస్తే అచ్చం బాహుబ‌లికి కాస్త అటు ఇటుగా ఉంద‌నే టాక్ ఉంది. అంతా ఓకే కానీ ఎక్క‌డో తేడా కొడుతుంద‌నే విమ‌ర్శ కూడా విన‌బ‌డుతుంది…

సైరా సినిమా అక్టోబ‌ర్2న విడుద‌ల‌కు సిద్ద‌మైన నేప‌థ్యంలో సినిమా ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను రంజింప‌చేయ‌డం ఖాయ‌మ‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. కాకుంటే సినిమాలో చిరంజీవి కొన్ని లుక్స్‌లో ఉన్న‌ట్లుగా మ‌రికొన్ని లుక్స్‌లో లేడ‌నేది ఓ టాక్‌. దీనికి తోడు చిరంజీవి గొంతులో ఉండే గాంభీర్యం కొంత త‌గ్గిన‌ట్లుగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఈరెండు తేడాలు త‌ప్పితే సినిమాకు డోకా లేద‌నే చెప్ప‌వ‌చ్చు… అయితే సినిమా థియోట‌ర్ల‌లో ఈ లోపాలు అంత‌గా క‌న‌ప‌డవు లేండ‌ని స‌ర్థుకునేవారు ఉండ‌క పోలేదు…

సైరా అంతా ఓకే… కానీ కొంచెం తేడా…!!
0 votes, 0.00 avg. rating (0% score)