టీడీపీకి మాజీ మంత్రి అది నారాయణరెడ్డి గుడ్ బై !

August 19, 2019 at 10:59 am

ఆంధ్రప్రదేశ్ లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వలసలని ఓ రేంజ్ లో ప్రోత్సహిస్తూ ఇతర పార్టీల నేతలపై వల వేస్తున్నారు. అందులో ముఖ్యంగా టీడీపీ నేతలనే ఎక్కువ టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులతో కలిసి చాలామంది నేతలుని బీజేపీ లాగేసుకుంది. అలాగే మరికొంత మంది నేతలని కూడా పార్టీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అటు టీడీపీ అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన సీఎం రమేశ్ తో ఆదినారాయణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారా బీజేపీలోకి వెళ్ళేందుకు ఆది పావులు కదుపుతున్నారని సమాచారం. కాగా, ఆదినారాయణరెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ అధికారంలో ఉండటంతో అందులోకి జంప్ అయ్యారు.

ఇక ఆదినారాయణకి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే మొన్నటిఎన్నికల్లో ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్ బరిలో దింపి, రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఇచ్చారు. ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఇష్టం లేకుండా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు రాష్ట్రంలో టీడీపీ కూడా అధికారం కోల్పోవడంతో ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్న ఆది బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సీఎం రమేశ్ ద్వారా బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్ళి టీడీపీకి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళితే కేసులు ఇలాంటి గోల ఉండదని ఆది భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలోనే ఆదినారాయణ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. చూద్దాం మరి ఆది టీడీపీకి ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో?

టీడీపీకి మాజీ మంత్రి అది నారాయణరెడ్డి గుడ్ బై !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts