టీడీపీ సైకిల్ దిగుతున్న సీనియ‌ర్లు..

August 24, 2019 at 10:18 am

టీడీపీని వీడేందుకు సీనియ‌ర్లు రెడీ అవుతున్నారా? ఇప్ప‌టికే జాతీయ పార్టీ బీజేపీ వీరిని అక్కున చేర్చుకు నేందుకు రెడీ అయిందా? ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు, త‌ర్వాత కూడా చాలా మంది నాయ‌కులు ఇత‌ర పార్టీ ల నుంచి టీడీపీలోకి వ‌చ్చి చేరారు. మ‌ళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనేన‌ని పెద్ద ఎత్తున క‌ల‌రింగ్ రావ‌డంతో అంద‌రూ సైకిల్ ఎక్కేశారు. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబుకు ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. దీంతో ఇప్పుడు వీరంతా మ‌ళ్లీ సైకిల్ దిగేసేందుకు రెడీ అయ్యార‌నే ప్ర‌చారం సాగుతోంది.

ముఖ్యంగా చంద్ర‌బాబును ఆహా వోహో అంటూ పొగిడిన బ్యాచే ఇప్పుడు ఆయ‌న‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకోవ‌డం చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌తంలో ఆది నారాయ‌ణ రెడ్డి జ‌గ‌న్ చెంత ఉండేవారు అయితే, ఆయ‌న మంత్రి ప‌ద‌వికోసం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో రామ‌సుబ్బారెడ్డితో ఉన్న వైరాన్ని కూడా దిగ‌మింగుకుని ప్ర‌చారం చేసినా.. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలో ఉన్నా శ్రేణులు మాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఆయ‌న బీజేపీ కీల‌క నేత న‌డ్డాతో భేటీ అయ్యారు. ఇక‌, పార్టీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక‌, అమ‌ర‌నాథ్‌రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి మ‌ళ్లీ వ‌చ్చారు. అయితే, ఇప్పుడు ఇక్క‌డ కూడా నిల‌దొక్కుకునే ప‌రిస్థితి లేదు.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కూడా పార్టీ మారేందుకు చూస్తున్నారు. చంద్ర‌బాబు పిలిచినా కూడా రాకుండా త‌ప్పించుకుని తిరుగుతున్నారు. ఇక పార్టీలోనే ఉన్న కీల‌క నాయ‌కులు అశోక్ గ‌జ‌ప‌తిరాజు వంటి వారు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారు పార్టీ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోయినా.. విశ్రాంతి రాజ‌కీయాలు మాత్రం చేయ‌నున్నారు. మొత్తానికి సీనియ‌ర్ల ఇనాక్టివ్‌తో టీడీపీ ఇబ్బందులు ప‌డుతోంది.

టీడీపీ సైకిల్ దిగుతున్న సీనియ‌ర్లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts