ముందే చెప్పిన భార్య‌… విన‌ని తెలంగాణ దిగ్గ‌జ నేత‌… :

August 23, 2019 at 10:21 am

ఆయ‌న మాజీ ఉప ముఖ్య‌మంత్రి.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీలో నిలిచారు. ఇక‌ ఆయ‌న భార్య ఒక్క‌సారిగా బీజేపీలో చేరడంతో అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన మాజీ ఉప ముఖ్య‌మంత్రి వెంట‌నే భార్య‌ను ఒప్పించి, ఆ రాత్రికి రాత్రే తిరిగి కాంగ్రెస్‌లో చేర్పించారు. అయితే.. ఇప్పుడు అదే నేత బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌నెవ‌రో మీరు ప‌సిగ‌ట్టి ఉంటారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. మెద‌క్ జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించిన దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌.

ఆయ‌న భార్య ప‌ద్మిని ఒక్క‌సారిగా క‌మ‌లం కండువా క‌ప్పుకున్న సీన్‌ను ఎవ‌రూ అంత సుల‌భంగా మ‌ర్చిపోలేరులే. అయితే.. అప్పుడు భార్య‌ను వ‌ద్ద‌న్న పార్టీలోకే దామోద‌ర వెళ్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.
దామోద‌ర రాజ‌న‌ర్సింహ కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించారు. అయినా 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. అయితే.. ఇక్క‌డే నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. దామోద‌ర కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.

అయితే.. ఆయ‌న భార్య ప‌ద్మిని.. అనూహ్యంగా బీజేపీ నేత‌ల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష‌మై క‌మ‌లం కండువా క‌ప్పుకున్నారు. దీంతో రాష్ట్ర రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాయి. నిజానికి.. దామోద‌ర కూడా కంగుతిన్నారు. వెంట‌నే భార్య‌ను ఒప్పించి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ షాక్ నుంచి కోలుకోవ‌డానికి ఆయ‌న‌కు చాలానే స‌మ‌యం ప‌ట్టిన‌ట్టు టాక్.

2019 ఎన్నిక‌ల్లోనూ దామోద‌ర ఓడిపోయారు. ఇక అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు పూర్తి దూరంగా ఉంటున్నారు. బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా.. తెలంగాణ‌లో పాగా వేయాల‌న్న క‌సితో దూసుకొస్తున్న బీజేపీ.. ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌ను లాగే ప‌నిలో ప‌డింది. ఇందులో మెద‌క్ నుంచి దామోద‌ర కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌లే ఆయ‌న భార్య ప‌ద్మిని రాంమాధ‌వ్‌ను క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. బీజేపీలోకి వెళ్దామ‌ని తాను ముందే చెప్పాన‌ని, అయినా ఆయ‌న విన‌లేదని, ఇప్పుడే చేరితో ఈరోజు భ‌విష్య‌త్ మారేద‌ని ప‌ద్మిని అనుచ‌రుల‌తో అంటున్న‌ట్లు తెలుస్తోంది.

ముందే చెప్పిన భార్య‌… విన‌ని తెలంగాణ దిగ్గ‌జ నేత‌… :
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts