తెలంగాణ చెరువుల్లో నీలి విప్ల‌వం…!

August 19, 2019 at 1:03 pm

తెలంగాణ రాష్ట్రంలో కుల‌వృత్తుల‌ను కాపాడి, కుల వృత్తుల‌తో బ‌తికేవారికి జీవ‌నోపాథి క‌ల్పించి ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు తెలంగాణ స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తుంది. అందులో భాగంగా ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం కులాల‌వారిగా వారికి ఎలాంటి జీవనోపాథి క‌ల్పించే ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక కులాల‌కు చెందిన వారికి కుల ఉపాధి కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రారంభించింది కేసీఆర్ ప్ర‌భుత్వం.

అయితే ఇప్పుడు గంగ‌పుత్ర‌, ముదిరాజ్‌, బెస్త కుల‌స్తుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్ళుగా చెరువుల్లో నీలి విప్ల‌వం తీసుకురావాల‌ని కృషి చేస్తుంది. అందులో భాగంగానే గ‌త నాలుగు ఏండ్లుగా చెరువులు, రిజ‌ర్వాయ‌ర్లు, కుంట‌లుల‌ను కేంద్రంగా చేసుకుని చేప‌ల పెంప‌కంకు స‌హాయం చేస్తుంది తెలంగాణ స‌ర్కారు. అందుకే మ‌త్స్య కార్మికులకు ఏలాంటి ఖ‌ర్చు లేకుండా, పెట్టుబ‌డి లేకుండా చెరువులు, కుంట‌లు, రిజ‌ర్వాయ‌ర్ల‌లో చేప పిల్ల‌ల‌ను ఉచితంగా అందిస్తుంది.

తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల‌తో వాగులు, వంక‌లు పొంగిపొర్లి చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఇక కృష్ణా, గోదావ‌రి, పాలేరు, ఆకేరు న‌దులు పొంగిపోర్లుతుండ‌టంతో ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌తో రిజర్వాయ‌ర్ల‌ను నింపుతున్నారు. అటు వాన‌లు, ఇటు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌తో నీటి వ‌న‌రులు పుష్క‌లంగా ఉండటంతో చేప పిల్ల‌ల పంపిణి విస్తృతంగా చేపట్టింది స‌ర్కారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24,953 చెరువులు, కుంట‌లు, రిజ‌ర్వాయ‌ర్ల‌లో చేప‌పిల్ల‌ల‌ను విడుద‌ల చేస్తున్నారు తెలంగాణ స‌ర్కారు. ఈ నీటి వ‌న‌రులు ఉన్న ప్రతి ప్రాంతంలో చేప పిల్ల‌ల‌ను విడుద‌ల చేస్తున్నది. స‌ర్కారు తెలంగాణ వ్యాప్తంగా 80కోట్ల‌, 8ల‌క్ష‌ల చేప పిల్ల‌ల‌ను, 26ల‌క్ష‌ల రొయ్య పిల్ల‌ల‌ను పంపిణి చేసేందుకు విత్తనాలు త‌యారు చేసి పెట్టింది. ఈ చేప పిల్ల‌లు పెరిగి పెద్ద‌వి అయితే తెలంగాణ వ్యాప్తంగా చేప‌ల‌కు కొదువ లేకుండా ఉంటుంది. అదే విధంగా ఇక్క‌డి నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు చేప‌ల‌ను ఎగుమ‌తులు చేసి మ‌త్స్య కార్మికులు ఆర్థికంగా ఎదుగుతారు.

ఈఏడాది 24,953 నీటి వ‌న‌రుల్లో, 80కోట్ల 8ల‌క్ష‌ల చేప పిల్ల‌లు, 26ల‌క్ష‌ల రొయ్య పిల్ల‌ల‌ను పంపిణి చేయాల్సి ఉండ‌గా నాలుగు విడ‌త‌ల కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త‌గా ఇప్ప‌టికే సుమారు 50లక్ష‌ల చేప‌ల పిల్ల‌ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు తెలంగాణ స‌ర్కారు చెపుతున్న‌ది. ఇంకా చెరువులు, కుంట‌లు, రిజ‌ర్వాయర్లు పూర్తిగా నిండితే మిగ‌తా చేప‌ల‌ను పంపిణి చేసేందుకు తెలంగాట‌ణ స‌ర్కారు సిద్ధంగా ఉంది. సో తెలంగాణ స‌ర్కారు నీలి విప్ల‌వంతో మ‌త్స్య‌కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు స‌మాయత్తం అయింది…

తెలంగాణ చెరువుల్లో నీలి విప్ల‌వం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts