పూరి టాలెంటే టాలెంట్‌…!!

August 19, 2019 at 2:07 pm

టాలీవుడ్‌లో ఎంత మంది డైరెక్ట‌ర్‌లు ఉంటేంది… ఎంత మంచి విజ‌యవంత‌మైన చిత్రం రూపొందిస్తే ఏంటి… టాలెంట్ ఉండాలి కానీ… అందుకే క్రేజ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ టాలెంట్‌కు కొదువే లేదు అనేది తెలిసిందే.. కానీ ఇక్క‌డ మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్ మాత్రం మిగ‌తా డైరెక్ట‌ర్ల‌కు భిన్నంగా దూసుకుపోతున్నాడు…

ఇంత‌కాలం స‌రైన హిట్లు లేక వెనుక‌బ‌డ్డ ద‌శ‌లో పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. ఈసినిమా తో ముగ్గురు జీవితాలు ఓ గాడిన ప‌డ్డాయ‌నే చెప్ప‌వ‌చ్చు. స‌రైన హిట్లు లేక ఇబ్బందులు ప‌డుతున్న ఎన‌ర్జీటిక్ హీరో రామ్‌కు, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కు, నట‌న‌లో అవ‌కాశాలు లేక నిర్మాత‌గా మారిన న‌టీ ఛార్మీల‌కు ఇస్మార్ట్ శంక‌ర్ మాత్రం జీవం పోసింద‌నే చెప్ప‌వ‌చ్చు.

అయితే మిగ‌తా హీరోలు మంచి హిట్ చిత్రాలు తీసినా కూడా అవ‌కాశాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. పూరి మాత్రం మ‌రో సినిమా సెట్స్‌పైకి తీసుకురాబోతున్నాడు. గీత గోవిందం లాంటి హిట్ చిత్రం రూపొందించిన ప‌రుశ‌రామ్‌కు అవ‌కాశాలు రాక ఎదురుచూస్తున్నాడు.. ఇక భ‌ర‌త్ అనే నేను లాంటి హిట్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొర‌టాల శివ ఇంకా చిరంజీవి డేట్స్ కోసం ఎదురుచూపులు త‌ప్ప‌డం లేదు.

ఇక రంగ‌స్థ‌లం ద‌ర్శ‌కుడు సుకుమార్‌, భాగ‌మ‌తి డైరెక్ట‌ర్ అశోక్‌, ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి, బోయ‌పాటి శ్రీ‌ను, మేర్ల‌పాక గాంధీ, క‌ళ్యాణ్ కృష్ణ‌, శ‌శికిర‌ణ్‌, త్రినాథ‌రావు, వ‌క్కంతం వంశీ, చందు మొండేటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక‌మంది ద‌ర్శ‌కులు సినిమాలు లేక‌, నిర్మాత‌లు రాక‌, హీరోల డేట్స్ కుద‌ర‌క కొత్త సినిమాల కోసం నీరిక్షిస్తున్నారు. అయితే పూరి జ‌గ‌న్నాథ్ మాత్రం కొత్త సినిమాతో దూసుకుపోతున్నాడు…

పూరి టాలెంటే టాలెంట్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts