బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ… క్లారిటీ

August 20, 2019 at 1:53 pm

కొన్ని నెల‌లుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు ఇక తెర‌ప‌డబోతోంది.. ఆ టీఆర్ఎస్ ఎంపీ ఏ పార్టీలోకి వెళ్ల‌బోతున్నార‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా..? బీజేపీలోకి వెళ్తారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇక స‌మాధానం దొరికింది. చివ‌ర‌కు ఆ సీనియ‌ర్ నేత‌, టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భుడు ఇక బీజేపీలోకి వెళ్లేందుకే నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆ టీఆర్ఎస్ ఎంపీ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. డీ శ్రీ‌నివాస్‌.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ వెలుగువెలిగిన నేత‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేర‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను సీఎం కేసీఆర్ రాజ్య‌స‌భ‌కు పంపండం తెలిసిందే.
ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. టీఆర్ఎస్‌కు డీఎస్ దూరంగా ఉంటున్నారు. అయితే.. ఆయ‌నే దూరంగా జ‌రిగారా..? లేక టీఆర్ఎస్ అధిష్టాన‌మే కావాల‌ని పొగ‌పెట్టిందా..? అన్నది మాత్రం వారికే తెలుసు.

అయితే.. ఇక్క‌డ డీఎస్ త‌న‌యుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బీజేపీలో కొన‌సాగుతుండ‌డం, అప్ప‌టి నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు క‌విత‌పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం.. ఇక ఇదే స‌మ‌యంలో డీఎస్‌పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ.. జిల్లా నేత‌ల‌తో క‌లిసి క‌విత అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డం.. దానిని కేసీఆర్ పెండింగ్‌లో ఉంచ‌డం..తెలిసిందే.

అప్ప‌టి నుంచి డీఎస్ పూర్తిగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఢిల్లీలో ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతార‌నే టాక్ వినిపించింది. ఇంత‌లోనే లోక్‌స‌భ‌ ఎన్నిక‌లు రావ‌డం.. క‌విత‌ను, బీజేపీ అభ్య‌ర్థి, డీఎస్ త‌న‌యుడు అర్వింద్ ఓడించ‌డం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపింది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏకంగా నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించింది. ఇక అప్ప‌టి నుంచి మ‌రింత దూకుడుగా క‌మ‌ల‌ద‌ళం వ‌స్తోంది. ఎలాగైనా తెలంగాణ‌లోపాగా వేయాల‌ని చూస్తోంది.

ఇందులో భాగంగా ఇత‌ర పార్టీల్లోని కీల‌క నేత‌ల‌ను లాగేస్తోంది. తాజాగా.. తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. సోమవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్‌ అనుచరవర్గానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో త్వ‌ర‌లోనే డీ శ్రీ‌నివాస్‌కూడా బీజేపీలో చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ… క్లారిటీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts