తూనీగ ట్రైలర్ …అది ఒక దైవ ర‌హాస్యం

August 19, 2019 at 5:30 pm

వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన తూనీగ దైవ ర‌హాస్యం సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేసింది. ఆద్యంతం ఆధునిక సాంకేతిక హంగుల‌తో నిండిన ఈ ట్రైల‌ర్ సినీ ప్రేమికుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమ్ సుప్రీమ్ అనే యువ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించ‌నుంది.

క్రౌండ్ ఫండింగ్ విధానంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని అందించ‌గా, సినిమాటోగ్ర‌ఫీ హ‌రీశ్ ఎదిగ సమ‌కూర్చారు. ఎడిట‌ర్‌గా ఆర్కే కుమార్, పోస్ట‌ర్ డిజైన‌ర్‌గా వ‌ర్థ‌మాన డిజిట‌ల్ ఆర్టిస్ట్ ఎంకేఎస్ మ‌నోజ్ వ్య‌వ‌హ‌రిం చారు. ప్రేమ్ పెయింటింగ్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతా కొత్త‌వారే క‌లిసి రూపొందించిన ఈ చిత్రం ట్రైల‌ర్‌ను మ్యాంగో మ్యూజిక్ సంస్థ ఆన్ లైన్ మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేసింది.

ఈ సినిమా మ‌రో ఈగ క‌థ‌ను పోలి ఉన్న‌ట్లుగానే అనిపించిన‌ప్ప‌టికి గ‌త చ‌రిత్ర‌ను, దైవ ర‌హాస్యంను ఎవ‌రు చెపుతారో చూపించారు. ఇందులో తూనీగ‌ను ప్ర‌త్యేక విజువ‌ల్స్‌ను ద‌ర్శ‌కుడు క‌ట్ చేశాడు. ఇక ఆది మానవుడు నుంచి ఇప్ప‌టి స్పేస్ సెంట‌ర్ల‌తో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఈ సినిమా క‌థ‌గా ఎంచుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ మాత్రం అటు దైవం, ఇటు ఆధునిక టెక్నాల‌జీతో ముడిపెట్టి చూప‌డం ఆక‌ట్టుకుంది. మొత్తానికి ట్రైల‌ర్ బాగానే రూపొందించాడు ద‌ర్శ‌కుడు.

తూనీగ ట్రైలర్ …అది ఒక దైవ ర‌హాస్యం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts