వాల్మీకి బ‌డ్జెట్ ఎఫెక్ట్‌… హ‌రీష్ రెమ్యున‌రేష‌న్ క‌ట్‌..!

August 24, 2019 at 5:00 pm

హీరో వరుణ్ తేజ్ తో డైరక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న లేటెస్ట్ సినిమా వాల్మీకి. ఈ సినిమాకు ప‌నిచేసినందుకు గాను సినిమా లాభంలో వాటా తీసుకోవాల‌ని ఒప్పందం చేసుకున్నార‌ట‌. అయితే సినిమాకు ముందుగా అనుకున్న బ‌డ్జెట్ కంటే చాలా ఎక్కువుగా… ఇంకా చెప్పాలంటే రూ.30 కోట్ల వ‌ర‌కు అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో హ‌రీష్‌కు ఇచ్చే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌లు కోత పెట్టేందుకు రెడీ అయ్యారు.

ఈ గొడ‌వ కాస్త పెరిగి పెద్ద‌ది అవ్వ‌డంతో ఇండ‌స్ట్రీకే చెందిన కొంద‌రు పెద్ద‌లు ఇద్ద‌రి మ‌ధ్య రాజీ చేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆఖరికి డైరక్టర్ హరీష్ శంకర్ కు ఏడుకోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి నిర్మాత‌లు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. హ‌రీష్ అల్లు అర్జున్‌తో చేసిన డీజే సినిమాకు రూ.8 కోట్లు తీసుకున్నాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే డీజే రేంజ్ వేరు.. దాని మార్కెట్ వేరు.. కానీ వాల్మీకిని డీజేతో కంపేరిజ‌న్ చేయ‌లేం.

త‌న రెమ్యున‌రేష‌న్‌లో రూ.2 కోట్లు వ‌దులుకుని ఉత్త‌రాంధ్ర రైట్స్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ పంపిణీ అంతా దిల్ రాజు చేతుల్లో పెడ‌తాడ‌ని టాక్‌. ఆంధ్రాలో రూ.10 కోట్ల‌కు అమ్ముడైన‌ట్టు భోగ‌ట్టా. నైజాం రూ.8 కోట్ల రేషియోలో చెపుతున్నార‌ట‌. బ‌య్య‌ర్ వెన‌కా ముందు ఆడుతుండ‌డంతో తాము శ‌ర్వానంద్‌తో తీసే త‌ర్వాత సినిమా రైట్స్ ఇస్తామ‌న్న న‌మ్మకంతో ఓ కోటి అడ్వాన్స్‌గా మొత్తం రూ.8 కోట్ల‌కు బేరం కుదురుతోందంటున్నారు.

ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ రైట్స్ నుంచి రూ.25 కోట్ల‌కు పైగానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నిర్మాత‌లు. అయితే అదే రోజు నాని గ్యాంగ్‌లీడ‌ర్ వ‌స్తుంద‌ని చెప్పినా ఇప్పుడు ఆ సినిమా హ‌డావిడి లేదు. గ్యాంగ్‌లీడ‌ర్ వాయిదా ప‌డితే వాల్మీకికి చాలా ప్ల‌స్ అవుతుంది. లేక‌పోతే ఈ మార్కెట్‌కు త‌గిన వ‌సూళ్లు ఎంత వ‌ర‌కు రాబ‌డుతుంద‌న్న‌ది సందేహ‌మే.

వాల్మీకి బ‌డ్జెట్ ఎఫెక్ట్‌… హ‌రీష్ రెమ్యున‌రేష‌న్ క‌ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts