మామ అల్లుండ్ల భీక‌ర‌పోరు…!

August 1, 2019 at 10:50 am

అస‌లే మామ అల్లుండ్లు.. ఇద్ద‌రు నిజజీవితంలోనూ, సీని జీవితంలో మామఅల్లుండ్లే… అయితే ఇప్పుడు ఇద్ద‌రు భీక‌ర‌పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు.. అట్లాంటి ఇట్లాంటి పోరు కాదు… ఒక్క‌సారే 500మందితో యుద్ధం చేయ‌బోతున్నారు… ఇదేం సిత్రమో కానీ మామఅల్లుండ్లు భీక‌ర‌పోరును చూసేందుకు రెండుకండ్లు సాల‌ద‌ల‌… ఇంత‌కు ఈ పోరాటానికి తెగ‌బ‌డుతున్న మామఅల్లుండ్లు ఎవ‌ర‌నుకుంటున్నారా… అయితే ఇది మీరు చ‌దువాల్సిందే…

సురేష్ ప్రొడ‌క్ష‌న్‌, ఫీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో మామఅల్లుండ్లు ఈ పోరుకు సిద్ద‌మ‌వుతున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టారర్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం వెంకిమామ‌. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం కె.ఎస్‌. ర‌వీంద్ర వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటుంద‌ట‌.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్స్‌ను హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో శ‌ర‌వేగంగా తెర‌కెక్కిస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌ల నేతృత్వంలో సుమారు 500మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు ఈ భారీ యాక్ష‌న్ సీన్‌లో పాల్గొంటున్నార‌ట‌. ఇంతమంది ఫైట‌ర్స్‌, ఆర్టిస్టులు పాల్గొంటున్నారంటే మామ అల్లుండ్లు భారీ స్థాయిలో పోరాటం చేయ‌బోతున్నార‌ని తేలిపోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా అందాల రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌లు న‌టిస్తున్నారు.

మామ అల్లుండ్ల భీక‌ర‌పోరు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts