వేలు పెట్ట‌నంటున్నవిజయ్ దేవరకొండ …!

August 23, 2019 at 11:51 am

తాకితే కాని మొగ్గ‌రు… త‌డిస్తే కాని క‌ప్ప‌రు… అనేది ఓ సామేత‌. ఇది అక్ష‌రాల టాలీవుడ్ యువహీరో విజయ్ దేవ‌ర‌కొండ‌కు అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోతుంది. ఎందుకంటే చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకుంటే ఏమి లాభం మీరే చెప్పండి… అట్లా ఉంది రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రిస్థితి. ఇంత‌కు ఈ సామెత‌ల‌న్నీ ఈ హీరోమీదే ఎందుకు ప్ర‌యోగిస్తున్నార‌ని మీకు అనుమానం రావ‌చ్చు.. కాకుంటే మేము ఎందుకు అంటున్నామో మీరే ఓసారి తేరిపార చూడండి…

పెళ్ళి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం సినిమాలు ఇచ్చిన ఊపుతో విజ‌య్ దేవ‌ర‌కొండ తాను ఆడింది ఆట పాడింది పాట అనుకున్నాడు. అందుకే డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాలో న‌టించాడు. అయితే తాను న‌టిస్తే బాగుండేది కానీ త‌న‌ది కానీ విష‌యాల్లో త‌ల‌దూర్చ‌డ‌మే కాకుండా… ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లోనే వేలు పెట్టాడ‌ట‌.. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో వేలు పెట్ట‌డమే కాకుండా త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ద‌ర్శ‌కుడికి, సాంకేతిక నిపుణుల‌కు స‌ల‌హాలు ఇస్తూ, తాను ద‌గ్గ‌రుండి చేయించేవాడ‌ట‌.

అయితే ఇక్క‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ప్పులో కాలేసాడు.. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంత‌టివాడు 150 సినిమాలు న‌టించి కూడా త‌న‌ప‌నిలో త‌ప్ప ఇత‌రుల ప‌నుల్లో జోక్యం చేసుకోడ‌నే పేరుంది.. అట్లాంటిది రెండు మూడు సినిమాలు హిట్ కాగానే త‌ల‌బిరుసుతో ఇలా త‌న‌ప‌నిని వదిలేసి ఇత‌రుల ప‌నుల్లో జోక్యం చేసుకుంటే రెండికి చెడ్డ రేవ‌డి క‌థ అవుతుంది. అందుకే హీరోగా మొద‌టిసారి డియ‌ర్ కామ్రేడ్‌తో ఇచ్చిన షాకు నుంచి తేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు న‌టిస్తున్న చిత్రాల్లో ఎవ‌రి ప‌నుల్లోను వేళు పెట్ట‌న‌ని మాటిస్తున్నాడ‌ట‌.. చూడాలి మ‌రి కుక్క తోక వంక‌ర‌ట‌… మ‌ళ్ళీ అలాగే చేస్తాడో.. బుద్దిగా ఉంటాడో..

వేలు పెట్ట‌నంటున్నవిజయ్ దేవరకొండ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts