షాక్‌లో విశాల్‌…. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్‌…!

August 22, 2019 at 10:46 am

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ వార్తలు సంచ‌ల‌నంగా మారాయి. తెలుగు వాడు అయినా కోలీవుడ్ స్టార్ హీరోగా ఎద‌గ‌డంతో పాటు న‌డిగ‌ర్ సంఘంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న విశాల్ కొద్ది రోజుల క్రితం అనీషా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. వీరి ఎంగేజ్మెంట్ కూడా కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగింది. అక్టోబ‌ర్ 9న పెళ్లి డేట్గా కూడా ఎనౌన్స్ చేశారు.

ఇక అనీషారెడ్డి తెలుగు సినిమా తెర‌పై త‌ళుక్కుమంది కూడా… హైదరాబాద్ కి చెందిన అనీషా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. విశాల్‌తో ఆమె ఎంగేజ్మెంట్ హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. ఇక ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోకూడ‌ద‌న్న నిర్ణ‌యంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి విశాల్ క‌న్నా అనీషాకే ఇష్టం లేద‌ట‌.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనీషా త‌న ఎంగేజ్మెంట్ ఫొటోల‌తో పాటు, విశాల్ ఫొటోలు త‌ర‌చూ షేర్ చేస్తూ ఉంటుంది. అటు విశాల్ కూడా ట్విట్ట‌ర్లో అనీషా ఫొటోలు షేర్ చేస్తుంటాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ర‌చూ పోస్టులు పెట్టే అనీషా స‌డెన్‌గా త‌న ఎంగేజ్మెంట్ ఫొటోల‌న్నింటిని తొల‌గించేసింది.
అలానే విశాల్ ఫోటోలను కూడా డిలీట్ చేసింది.

ఇటు విశాల్ కూడా ఆమె పోస్టులు పెట్ట‌డం ఆపేసిన‌ట్టు తెలుస్తోంది. కార‌ణాలు తెలియ‌క‌పోయినా అనీషా మాత్రం పెళ్లి బ్రేక్ చేసుకోవాలని నిర్ణయించుకుందని టాక్. కానీ విశాల్ మాత్రం ఆమెను ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. మరేం జరుగుతుందో చూడాలి..!

షాక్‌లో విశాల్‌…. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts