జ‌గ‌న్‌కు ఇది గుణ‌పాఠంలాంటిదే..!

August 24, 2019 at 10:49 am

ఏపీలో వ‌ర‌ద రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఈ అంశంపై అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో దుమెత్తిపోసుకుంటున్నాయి. రాష్ట్రంలో వ‌ర‌ద‌ల‌ను తెలుగుదేశం పార్టీ త‌న‌కు అస్ర్తంగా మ‌లుచుకుంది. వైసీపీ ప్రభుత్వం సమర్థంగా నష్ట నివారణ చర్యలు చేపట్టినా.. ప్రచారంలో విఫలం కావ‌డంతో టీడీపీ విరుచుకుపడుతోంది. వరద న‌ష్ట నివార‌ణ‌లో వైసీపీ విఫలమైందని, అందుకే పంటలు నీటమునిగాయని, బాధితుల్ని ఎవరూ ఆదుకోలేదని యాగీ చేస్తోంది.

కృష్ణా వరదల్ని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుని అటు ముంపు జిల్లాల్లో.. ఇటు సీమ జిల్లాల్లో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించింది టీడీపీ. ఇక ఆపార్టీ అనుకూల మీడియా కూడా అగ్నికి ఆజ్యం పోస్తోంది, సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్ట్ లను వ‌దులుతూ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తోంది. అయితే ఈ అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌డంలో అధికార వైసీపీ పార్టీ పూర్తిగా వి ఫ‌ల‌మైంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో వరదలు వస్తే సహాయక చర్యలు చేపట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ శ‌క్తిమేర‌కు ప‌నిచేసి, ప్రాణ నష్టం పూర్తిగా నివారించగలిగారు. ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగారు, పునరావాసం చూపించే విషయంలో కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించారు.
అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ, వరద ప్రాంతాల జనం బాగోగుల్ని మిగతా ప్రపంచానికి చూపించే విషయంలోనే వైసీపీ నేతలు వెనకపడ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీకి దీటైన స‌మాధానం ఇవ్వ‌లేక‌, క‌నీసం తాము చేసిన ప‌నుల‌ను కూడా చెప్పుకోలేక చ‌తికిల‌ప‌డ్డారు మంత్రులు.

మొత్తంగా వ‌ర‌ద‌ల అంశాన్ని టీడీపీ చాలా బాగా ప్రొజెక్ట్ చేయ‌గా, వైసీపీ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌లేక‌పోయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాష్ట్రంలో లేక‌పోవ‌డంతోపాటు, మంత్రులు కూడా అనుకున్న స్థాయిలో స్పందించ‌క‌పోవ‌డంతో టీడీపీకి అడ్డుక‌ట్ట వేసేవారు క‌రువ‌య్యారు. దీనికి తోడు వ‌ర‌ద‌ల అంశాన్ని ప‌క్క‌న బెట్టి, రాజ‌ధానిపై మంత్రులు గంద‌ర‌గోళ ప్ర‌క‌ట‌న‌లు చేసి, ప్ర‌జ‌ల్లో మ‌రింత క‌న్ఫూజ‌న్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇది ఒక‌ర‌కంగా సీఎం జ‌గ‌న్‌కు ఒక గుణ‌పాఠంలాంటిద‌ని, భ‌విష్య‌త్‌లో ఆయ‌న త‌న‌ మంత్రులెవ‌రినీ పూర్తిగా న‌మ్మ‌కుండా, సొంతంగా ప‌నిచేసుకుంటే ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

జ‌గ‌న్‌కు ఇది గుణ‌పాఠంలాంటిదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts