ప్రజాభిమానంలో టాప్‌గేర్‌లో జగన్

August 18, 2019 at 11:15 am

సర్వే సంస్థలు తరచూ అనేకానేక విషయాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రజలు ఏం అనుకుంటున్నారో తతిమ్మా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం కూడా చేస్తుంటాయి. అలాంటి సర్వేలు రెండు దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుపై ఇటీవలి కాలంలోనే జరిగాయి. అయితే రెండు సంస్థలు విడివిడిగా చేసిన ఈ వేర్వేరు సర్వేల్లో జగన్మోహన రెడ్డి మాత్రం టాప్ గేర్ ప్రజాదరణను సొంతం చేసుకోవడం విశేషం.

వీడీపీ అసోసియేట్స్ సంస్థ వారు దేశ్ కా మూడ్ పేరుతో ముఖ్యమంత్రులపై ఓ సర్వే నిర్వహించారు. ఇందులో ఒదిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫస్ట్ ర్యాంక్ లో రాగా, జగన్ కు మూడో ర్యాంక్ దక్కింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ కు రెండో ప్లేస్ దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదో స్థానంలో ఉన్నారు.

అదే తరహాలో ఇండియాటుడే వారు కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ముఖ్యమంత్రుల మీదనే మరో సర్వే కూడా నిర్వహించారు. ఆగస్టు 14 వతారీఖునే దీని ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ సర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌కు ఫస్ట్ ర్యాంక్ లభించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. మూడో ర్యాంకును ముగ్గురు ముఖ్యమంత్రులు పంచుకున్నారు. ఒదిశా- నవీన్ పట్నాయక్, ఢిల్లీ- కేజ్రీవాల్, మహారాష్ట్ర- దేవేంద్ర ఫడ్నవీస్ లకు అది దక్కింది. కాగా జగన్మోహన రెడ్డి ఈ సర్వేలోనూ నాలుగో స్థానంలో ఉన్నారు.

దేశంలో రెండు సర్వేలు జరిగితే… రెండింటిలోనూ… ఈ రెండున్నర నెలల ప్రాయం ఉన్న ముఖ్యమంత్రి టాప్ గేర్ లో తన పనితనం నిరూపించుకోవడం విశేషమే. అధికారంలోకి వచ్చిన నాటినుంచి అవినీతిని నిర్మూలించడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు, దానికి తగ్గట్లు పరిపాలన వ్యవస్థలో మొత్తం మార్పు చేర్పులు తీసుకురావడం, ప్రజా సంక్షేమం దిశగా తాను సంకల్పించిన నవరత్నాల పథకాలను త్వరితగతిన అమల్లోకి తీసుకురావడం ఇవన్నీ ఆయనకు పాజిటివ్ అంశాలుగా మారాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మాత్రమే కాదు.. ఎన్నికల తర్వాత సర్వేల రూపంలో కూడా జగన్ తన అసామాన్య ప్రజాదరణ నిలబెట్టకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రజాభిమానంలో టాప్‌గేర్‌లో జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts