కార్తికేయ 90ఎంఎల్ టీజర్ ..!

September 21, 2019 at 3:58 pm

కార్తికేయ హీరోగా ఆర్ ఎక్స్ 100 సినిమాతో వ‌చ్చి యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత హీరోగాఆయన చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. అయితే ఓవైపు విల‌న్‌గా న‌టిస్తున్న‌ కార్తికేయ హీరోగా 90ml అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజ‌ర్‌ ని ఈరోజు విడుదల చేశారు.

హీరో కార్తికేయది ఈరోజు పుట్టిన రోజు. పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని 90ఎంఎల్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌. పూటకో 90 తాగే కేర్‌లేస్‌ కుర్రాడి పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. టీజర్‌ ద్వారా సినిమాలో కార్తికేయ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పారు. ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పేరు దేవదాస్‌. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ ఆథరైజ్డ్‌ డ్రింకర్‌గా పాపులర్‌ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే కాన్సెప్ట్ తో సినిమాను చిత్రీకరిస్తున్నారు.

90ఎంఎల్ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా చిత్రం ఫ‌స్ట్‌లుక్ చూస్తే సినిమాపై యూత్‌తో క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విల‌న్‌గా రాణిస్తున్న కార్తికేయ‌కు హీరోగా ఈ సినిమా ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో వేచి చూడాల్సిందే.

కార్తికేయ 90ఎంఎల్ టీజర్ ..!
0 votes, 0.00 avg. rating (0% score)