‘ఆవిరి’ ని ప‌ట్టేసిన దిల్‌రాజు…!

September 11, 2019 at 11:04 am

సిని ప‌రిశ్ర‌మ‌లో డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాత‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు దిల్ రాజు. ఇప్పుడు దిల్ రాజు సిని రంగంలో ఏది అంటే రైట్ అవుతుంది. ఆయ‌న ఏదైనా సినిమా టెక‌ప్ చేసాడంటే ఆ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొంటాయి. దీంతో ఆ సినిమాపై భారీ హైప్ పెరిగిపోయి అటు ప‌రిశ్ర‌మ‌లో, ఇటు ప్రేక్ష‌కుల్లో ఒక‌టే క్యూరియాసిటి పెరుగుతుంది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నాడు.

నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ద‌ర్శ‌కుడు, విల‌క్ష‌ణ న‌టుడు, ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తూ రూపొందిస్తున్న‌ చిత్రం ‘ఆవిరి’ ని దిల్ రాజు టేకప్ చేస్తున్నారు. దాంతో ఆ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిపోయింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా, విల‌క్ష‌ణ నటుడుగా రవిబాబు పేరుంది. ఓ చిన్న పందిపిల్లతో ‘అదుగో’ సినిమాతో ముందుకొచ్చి ప్రేక్షకులను నిరాశపర్చాడు రవిబాబు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. గ‌తంలోనే ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల్లో కొత్తద‌నాన్ని నింపాడు.

ఆవిరి సినిమాలో ఒక గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్‌ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటంతో ఈ పోస్టర్‌ ఆకట్టుకుంది. ఆవిరి సినిమా షూటింగ్ పూర్తై పోయిందని సమాచారం. నిర్మాత దిల్ రాజు కు సినిమా చూపించారని, ఆయన కు కాన్సెప్టు నచ్చి రిలీజ్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమాను విడుద‌ల చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో భారీ ఆస‌క్తి నెల‌కొంది.

‘ఆవిరి’ ని ప‌ట్టేసిన దిల్‌రాజు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts