అఖిల్ 5వ ప్రాజెక్ట్… ఆ క్రేజీ డైరెక్ట‌ర్‌తోనే

September 17, 2019 at 10:20 am

అక్కినేని నవమన్మధుడు అఖిల్‌కు సినిమా కేరీర్ ఇప్పటివరకు ఏమాత్రం కలిసిరాలేదు. భారీ అంచనాలతో వచ్చిన తొలి మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వినాయక్ దర్శకత్వంలో చేసిన అఖిల్… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన హలో నిరాశపరచడంతో అఖిల్ మూడో ప్రయత్నంలో ఓ ప్రేమ కథను తీసుకొని మిస్టర్ మజ్ను సినిమాతో మనముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా నిరాశ పరచడంతో అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని నాలుగో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను బన్నీ వాసు – గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అఖిల్ ఐదో ప్రాజెక్టుకు కూడా రంగం సిద్ధమయింది. ఓ క్రేజీ డైరెక్టర్ తో అఖిల్ ఐదో సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గీత గోవిందంతో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని స్క్రిఫ్ట్ రెడీ చేసుకున్న ప‌ర‌శురామ్ అఖిల్‌కు వినిపించ‌డం.. అఖిల్‌, నాగ్ ఓకే చేయ‌డం జ‌రిగాయ‌ట‌. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ఈ స్క్రిఫ్ట్ మీద సీరియ‌స్‌గా వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. మ‌రి ప‌ర‌శురామ్ అయినా అఖిల్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చి కెరీర్ ట‌ర్న్ చేస్తాడేమో ? చూడాలి.

అఖిల్ 5వ ప్రాజెక్ట్… ఆ క్రేజీ డైరెక్ట‌ర్‌తోనే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts