ఆ స్టార్ డైరెక్ట‌ర్‌కు మెగా హీరో హ్యాండ్‌… !

September 18, 2019 at 11:24 am

మెగా హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ – బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా తో మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది కాంతం వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్లాప్ కావడంతో కథల విషయంలో చాలా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు. చాలా కథలు విని విని కానీ సినిమాకు ఓకే చెప్పడం లేదు. నా పేరు సూర్య తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను ఓకే చేసిన సంగతి తెలిసిందే.

అల వైకుంఠ‌పురం టైటిల్‌తో తెర‌కెక్కే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కథల విషయంలో ఎలాంటి రాంగ్ స్టెప్ వేసినా అది కెరీర్ పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరోవైపు రంగస్థలం సినిమా రామ్ చరణ్ అల్లు అర్జున్ మార్కెట్‌ను బీట్‌ చేసేశాడు. దీంతో త్రివిక్రమ్ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ కొడితే కానీ అల్లు అర్జున్ మార్కెట్ పెరిగే పరిస్థితి లేదు.

త్రివిక్రమ్ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కే ఐకాన్‌ సినిమా షూటింగులో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఆ వెంటనే సుకుమార్ సినిమా కోసం బన్నీ పని చేస్తాడు. మ‌రోవైపు సుకుమార్ చాలా తొంద‌ర పెడుతున్నాడ‌ట‌. దీంతో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్‌కు హ్యాండ్ ఇచ్చేశాడ‌ని… ఈ విష‌యం ఇప్ప‌టికే అటు నిర్మాత దిల్ రాజుతో పాటు వేణు శ్రీరామ్‌కు సైతం చెప్పేశాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌థ నా పేరు సూర్య టైప్‌లో రిస్కీగా ఉండ‌డంతో పాటు భారీ బడ్జెట్ కావ‌డంతో మ‌నోడు ఆ సాకు చూపించి వేణుశ్రీరామ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్‌. నిర్మాత రాజుకు మాత్రం మ‌రో క‌థ‌తో మీ సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌కు మెగా హీరో హ్యాండ్‌… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts