తెలుగు రాష్ట్రాల్లో యూత్‌కు ‘ స్పెర్మ్ ‘ క్రేజ్‌

September 23, 2019 at 10:46 am

ఇప్పటి వరకూ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల‌కే పరిమితమైన స్పెర్మ్‌ బ్యాంక్‌లు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి.
యుక్త వయసులో ఉండే వీర్యకణాలు, అండాలనూ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి.. కావాలనుకున్నప్పుడు విత్‌ డ్రా చేసుకుని పిల్లల్ని కనే సదుపాయం ఉంది. ‘స్పెర్మ్‌ బ్యాంక్‌’లుగా పిలిచే ఈ నూతన సాంకేతిక ప ద్ధతులపై యువ దంపతుల్లో ఆసక్తి పెరుగుతోంది.

సహజంగా 30 ఏళ్లు దాటాక పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి అవకాశాలు సన్నగిల్లుతాయి. వయసు పెరిగేకొద్దీ పురుషుల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు, స్త్రీలలో అండాల లభ్యత తగ్గుతాయి. మూడు పదుల వయసు దాటిన వారిలో సంతాన లేమితో పాటు పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలూ రావచ్చని వై ద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి స్పెర్మ్‌ బ్యాంక్‌లు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి.

పెళ్లితో ఉన్నత చదువులు, కెరీర్‌కు ఆటంకం కలుగుతుందన్న భావన నేటి యువతలో పెరిగిపోయింది. పెద్దల మాట కాదనలేకో, మంచి సంబంధాలొచ్చాయనో.. ఆలస్యమైతే ఇబ్బందులెదురవుతాయని కెరీర్‌లో స్థిరపడకపోయినా 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటున్నారు. మరోవైపు పెళ్లయిన కొంతకాలానికి కొందరు మహిళలు ఊబకాయులవుతున్నారు. ఇలాంటి వారిలో సంతాన సాఫల్య అవకాశాలు తక్కువ. వారంతా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిన స్పెర్మ్‌ బ్యాంక్‌లను వినియోగించుకోవాలని చూస్తున్నారు.

మెట్రో నగరాల్లో కొంతమంది పెళ్లికి ముందే వీటిని స్పెర్మ్‌ బ్యాంక్‌ల్లో దాచుకుంటున్నారు. వివాహం చేసుకుని విదేశాలకు వెళ్తున్న పురుషులు, ఎన్‌ఆర్‌ఐలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంతానం కావాలనుకున్నప్పుడు భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ వైద్యులు వాటిని భార్య గర్భసంచిలోకి ప్రవేశపెట్టి గర్భం దాల్చేలా చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో యూత్‌కు ‘ స్పెర్మ్ ‘ క్రేజ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts