అనుష్క….నిశ్శబ్దం..!

September 11, 2019 at 12:59 pm

అందాల న‌టి అనుష్క, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుద‌ల చేసింది. హీరోయిన్ అనుష్క‌శెట్టి న‌టిస్తున్న సైలెంట్ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సైలెంట్‌గానే విడుద‌ల చేశారు.

సైలెంట్ ఫ‌స్ట్‌లుక్‌లో అనుష్క పెయింటింగ్ వేస్తున్నట్టుగా ఉంది. టైటిల్‌కి సాక్షి.. మ్యూట్ ఆర్టిస్ట్ అనే క్యాప్షన్ జత చేశారు. అనుష్క పెయింటింగ్ ద్వారానే మనసులోని మాటలని చెబుతుందని ఇదే కాన్సెప్ట్ తో సినిమాను తెర‌కెక్కించార‌ని సిని ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కావ‌డంతో అనుష్క అభిమానులు ఖుషిగా ఉన్నారు.

సెలెంట్ చిత్రంలో ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల కానుంది. త్వ‌ర‌లో సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు.

అనుష్క….నిశ్శబ్దం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts