ఏపీ, తెలంగాణలో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్

September 11, 2019 at 4:45 pm

బాహుబ‌లి సినిమా స‌ర‌స‌న ఇప్పుడు సైరా నిలిచింది. బాహుబ‌లి రికార్డును చేరుకునేందుకు కేవ‌లం కొద్ది దూరంలో నిలిచిపోయింది సైరా చిత్రం. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌డికి కేవ‌లం మూడు సినిమాలు మాత్రం రికార్డులు సృష్టించ‌గా అందులో ఒక‌టి సైరాగా నిలువ‌డంతో చిత్ర యూనిట్ ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతుంది. ఇంత‌కు సైరా బాహుబ‌లి రికార్డుకు చేరువలోకి వ‌చ్చిన‌ది ఎందులో.. సినిమా విడుదల కాకుండానే రికార్డుల దిశ‌గా ఎందులో ప‌రుగుదీసింది అనే క‌దా మీ డౌట్‌..

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం సైరా. అక్టోబ‌ర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగిస్తుంది. అప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో సైరా ఫ్రీ రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది. తెలుగులో సైరా చిత్రం రూ.100కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. రూ.100కోట్ల క్ల‌బ్‌లో చేరిన మూడో చిత్రం గా సైరా నిలిచిపోయింది. ఇప్ప‌టికే యంగ్ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి 1, 2 సినిమాలు, సాహో చిత్రాలు మాత్ర‌మేన‌ట‌. ఇప్పుడు సైరా కూడా థియోట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ.108కోట్ల‌కు అమ్ముడైన‌ట్లు తెలుస్తుంది.

బాహుబ‌లి సినిమా రూ.111కోట్ల‌కు అమ్ముడు పోగా సైరా కేవ‌లం మూడు కోట్లు త‌క్కువ‌కు అమ్ముడ‌పోయి బాహుబ‌లి రికార్డ‌ను క్రాస్ చేయ‌లేక‌పోయింది. సైరా చిత్రం నైజాంలో రూ.30కోట్లు, సీడెడ్ రూ.20కోట్లు, యూఏలో రూ.14.40కోట్లు, గుంటూరు రూ.11.50కోట్లు, ఈస్ట్ గోదావ‌రి రూ.9.80కోట్లు, వెస్ట్ గోదావ‌రి రూ.8.40కోట్లు, కృష్ణా రూ. 9కోట్లు, నెల్లూరు రూ.4.80కోట్లు మొత్తం 107.90కోట్ల బిజినెస్ చేసింది. సో బాహుబ‌లి రికార్డుకు చేరువ‌లోకి వ‌చ్చిన సినిమాగా సైరా నిలిచింది.

ఏపీ, తెలంగాణలో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts