ఏపీలో డిసెంబ‌ర్‌లో ఎన్నిక‌లు

September 12, 2019 at 3:09 pm

గత ఏడాది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. గత డిసెంబర్లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల నుంచి ఎప్పుడు ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటోంది. లోక్‌స‌భ ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే ఎన్నికల నుంచి తెలుగు ప్రజలు కాస్త రిలాక్స్ అవుతున్నారు అనుకుంటున్న టైంలో మరో ఉప ఎన్నిక వస్తోంది. తెలంగాణలో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన హుజూర్‌న‌గర్ అసెంబ్లీ సీటుకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

ఇక ఏపీలోనూ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో పంచాయతీలు – సహకార సంఘాలు – మున్సిపాలిటీలు – మండల పరిషత్, జిల్లా పరిషత్ సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఒక్కొక్కటిగా ముగించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిసెంబరులో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్ర‌మంలోనే కొన్ని కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిపేందుకు ఉన్న న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందుల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

కొత్త కార్పొరేషన్లు,మున్సిపాలిటీల్లో నిబంధలనల ప్రకారమే ఎన్నికలు జరుపుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో ఒంగోలు, గుంటూరు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌ప‌లేదు. ఈ సారి అయినా వైసీపీ ప్ర‌భుత్వం అక్క‌డ ఎన్నిక‌లు జ‌రిపితే ఆయా న‌గ‌రాలకు పాల‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డి అభివృద్ధి చెందుతాయ‌ని అక్కడ ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు.

ఏపీలో డిసెంబ‌ర్‌లో ఎన్నిక‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts