బ్రేకింగ్‌: టీటీడీ స‌భ్యుల‌ను ఖ‌రారు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

September 17, 2019 at 3:10 pm

ప్ర‌తిష్టాత్మ‌కమైన తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సభ్యులను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పెద్ద స‌స్పెన్స్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడో మాజీ ఎంపీ వైవి.సుబ్బారెడ్డి టీటీడీ చైర్మ‌న్‌గా ఎంపిక‌య్యారు. ఇక తాజా బోర్డులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, చోటు కల్పించారు. తమిళనాడు కోటాలో నలుగురికి, కర్నాటక నుంచి ముగ్గురికి, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించారు. మొత్తం ఏపీ నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు, త‌మిళ‌నాడు నుంచి ఒక ఎమ్మెల్యే చోటు ద‌క్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చోటు దక్కించుకున్న వారు….
1. కె. పార్థసారథి ( పెన‌మ‌లూరు ఎమ్మెల్యే )
2. యూవీ రమణమూర్తి ( య‌ల‌మంచిలి ఎమ్మెల్యే )
3. మల్లికార్జున రెడ్డి (రాజంపేట‌ ఎమ్మెల్యే )
4. గొల్ల బాబురావు (పాయ‌క‌రావుపేట‌ ఎమ్మెల్యే )
5. నాదెండ్ల సుబ్బారావు
6. వీ.ప్రశాంతి
7. చిప్పగిరి ప్రసాద్ కుమార్
8. డీపి. అనంత

తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులు :
1.జూపల్లి రామేశ్వరరావు
2. బి. పార్థసారథిరెడ్డి
3. యూ. వెంకట భాస్కర్‌రావు
4. మూరంశెట్టి రాములు,
5. డి. దామోదర్‌ రావు,
6. కే శివకుమార్‌
7. పుత్తా ప్రతాప్ రెడ్డి

తమిళనాడు నుంచి…
1. కృష్ణమూర్తి వైద్యనాథన్
2. ఎస్‌. శ్రీనివాసన్
3. డా. నిచిత ముట్టువరపు
4. కుమారగురు. ఎమ్మెల్యే

కర్నాటక నుంచి టీటీడీ సభ్యులుగా…
1. రమేష్‌ శెట్టి
2. సంపత్‌ రవి నారాయణ
3. సుధా నారాయణమూర్తి

మహారాష్ట్ర :
1. రాజేశ్ శర్మ

ఢిల్లీ :
1. ఎంఎస్‌ శివ శంకరన్‌

వీరితో పాటు తుడా చైర్మన్‌, స్పెషల్ సీఎస్, దేవాదాయ కమిషనర్‌, టీటీడీ ఈవోలు ఎక్సాఫిసియో సభ్యులుగా ఉంటారు.

బ్రేకింగ్‌: టీటీడీ స‌భ్యుల‌ను ఖ‌రారు చేసిన ఏపీ ప్ర‌భుత్వం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts