పూరికి బాల‌య్య‌ గ్రీన్ సిగ్న‌ల్ …!

September 17, 2019 at 2:31 pm

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తో న‌ట‌ర‌త్న నంద‌మూరి బాల‌య్య తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడా.. అయితే బాల‌య్య తో గ‌తంలోనే సినిమా చేద్దామ‌నుకున్న పూరి జ‌గ‌న్నాథ్ ప్లాఫ్ ల‌తో కాలం వెళ్ళ‌దీస్తుండ‌టంతో ఆయ‌న‌ను ఎవ‌రు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఇటీవ‌లే ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా లాంటి మాస్ హిట్ రావ‌డంతో ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు అవ‌కాశాలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చి పడుతున్నాయి.

బాల‌య్య‌తో సినిమా చేద్దామ‌ని అనుకున్న‌ప్ప‌టికి పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిస్థితి బాగాలేక పోవ‌డంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు పూరి మ‌ళ్ళీ ట్రాక్ ఎక్క‌డంతో బాల‌య్య‌తో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింద‌ట‌. గ‌తంలో బాల‌య్య‌తో పూరి జ‌గ‌న్నాథ్ పైసా వ‌సూలు సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్న మేర‌కు విజ‌యం సాధించ‌లేదు. అయితే మ‌రోమారు పూరి జ‌గ‌న్నాథ్‌, బాల‌య్య కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకు తెర లేచింద‌నే చెప్ప‌వచ్చు. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలిసింది.

ప్ర‌స్తుతం పూరి జగ‌న్నాథ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభించి పూర్తి చేసిన త‌రువాత బాల‌య్య‌తో సినిమా ఉంటుంద‌ట‌. బాల‌య్య ఇప్పుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌తో సినిమా చేస్తున్నాడు. త‌రువాత బోయ‌పాటి శ్రీ‌నివాస్‌తో బాల‌య్య సినిమా చేస్తాడు. దీని త‌రువాత పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా ఉంటుంద‌ని తెలిసింది.

పూరికి బాల‌య్య‌ గ్రీన్ సిగ్న‌ల్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts