వ్యూహం మార్చిన బాబు.. మ‌ర్మం అదేనా…?

September 28, 2019 at 10:50 am

రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.. ప్ర‌భుత్వంపై దూకుడు చూపుతున్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం మైలేజీ సంపాయించుకోలేక పోతోంది. పోయిన చోటే వెతుక్కోమ‌న్న‌ట్టుగా.. చంద్ర‌బాబు ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని గాడిన పెట్టేందుకు ప్ర‌భుత్వంపై పోరాటం చేయ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారు. అయితే, ఇది స‌క్సెస్ కాలేదు. దీంతో నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ దూర‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల వివిధ కేసుల కార‌ణంగా మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఉదంతంతో టీడీపీలో పెను అల‌జ‌డి చోటు చేసుకుంది.

పార్టీ కోసం మేం ఎంతో చేశాం.. కానీ, మేం క‌ష్టాల్లో ఉంటే మాత్రం పార్టీ ప‌ట్టించుకోవడం లేదు.. అనే ప్ర‌చారం , విమ‌ర్శ‌లు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు ద్విపాత్రాభిన‌యానికి తెర‌దీశారు. ఒక ప‌క్క‌, జ‌గ‌న్ స‌ర్కారును విమ‌ర్శిస్తూనే.. మ‌రోప‌క్క‌, త‌న పార్టీ నేత‌ల‌కు మ‌నో ధైర్యం క‌లిగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో నే శుక్ర‌వారం ఒక్క‌రోజే రాష్ట్రంలోన అన్ని ప్రాంతాల్లోనూ ఇబ్బందుల్లో ఉన్న నాయ‌కుల‌ను ఓదార్చే కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు బాబు.

ఆయ‌న నేరుగా విజ‌య‌న‌గ‌రం వెళ్లి.. పార్టీకి దూరంగా ఉన్న మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజును ప‌రామ ర్శిం చారు. ఆయ‌న కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. దీంతో పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూ డా ఆయ‌న‌ను ప‌ల‌క‌రించింది లేదు. ఇదే విష‌యంపై ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు ప‌నిగ‌ట్టుకుని ఆయ‌న‌ను క‌లిసి వ‌చ్చారు. అదేస‌మ‌యంలో పార్టీలో కీల‌క నేత‌, మాజీ హోం మంత్రి చిన‌రాజ‌ప్ప ఏకంగా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను క‌లిసి వ‌చ్చారు. ఆయ‌న‌కు ధైర్యం చెప్పారు.

అదేస‌మ‌యంలో ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. అదేవిధంగా గుంటూరులోని గుర‌జాల మాజీ ఎమ్మెల్యే , ప్ర‌స్తుతం మైనింగ్ కేసుల్లో చిక్కుకున్న య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావును మాజీ మంత్రి డొక్కా ప‌రామ‌ర్శించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ నేత‌లకు చంద్ర‌బాబు ధైర్యం చెబుతూ.. పార్టీని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ్యూహం మార్చిన బాబు.. మ‌ర్మం అదేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts