విక్రమ్‌ ల్యాండింగ్‌పై బిగ్ స‌స్పెన్స్‌…!

September 7, 2019 at 10:42 am

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్‌-2 ప్రాజెక్టును చేపట్టింది. ఇంతవరకు ఏ దేశం శోధించని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడానికి భారత్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 48 రోజుల ఈ బృహత్తర యజ్ఞంలో ప్రతి దశనూ విజయవంతంగా అధిగమిస్తూ వచ్చిన చంద్రయాన్‌-2 చివ‌రి ద‌శ‌లో ఏమైంది ? అన్న‌ది మాత్రం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌లేదు. 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. చంద్రుడికి అత్యంత సమీపకక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్‌ విక్రమ్‌.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సరిగ్గా జరిగిందా ? జరగలేదా ?అన‌్న‌ది తెలియ‌క‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఆందోళ‌న‌లో ప‌డిపోయారు.

విక్రమ్‌ ల్యాండింగ్‌లో చివరి పావుగంటను ‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ అని ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ అన్నప్పుడు ఆ విష‌యం చాలా మందికి ఎక్క‌లేదు. కాని శుక్ర‌వారం రాత్రి ఆ భ‌యం ఎలా ఉంటుందో ? దేశం అంతా తెలిసింది. స్టార్టింగ్ నుంచి ల్యాండింగ్ దాకా ప్ర‌తి ద‌శ‌లోనూ విజ‌య‌వంతం అయినా చివ‌ర్లో సంకేతాలు ఆగిపోవ‌డంతో తీవ్ర‌మైన ఉత్కంఠ క్రియేట్ అయ్యింది. అప్పటిదాకా అక్కడున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. దీంతో.. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది భారతీయుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

చివ‌ర‌కు మోడీ అక్క‌డ నుంచి వ‌చ్చి శాస్త్ర‌వేత్త‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రిని అభినందించ‌డంతో పాటు మీడియాతో మాట్లాడారు. శాస్త్ర‌వేత్త‌లు చేసిన కృషిని అభినందించారు. చంద్రయాన్‌ను ప్రయోగించడం నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపే దాకా అత్యంత కీలక ఘట్టాలు ఇవే.

2019 జూలై 22: మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌ 2ను జీఎస్‌ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. దీనిని 169.7కిలోమీటర్ల పెరీజీ, 45,475 కిలోమీటర్ల అపోజీ గల భూకక్ష్యలో ప్రవేశపెట్టారు.

జూలై 24- ఆగస్టు 2: చంద్రయాన్‌ భూకక్ష్య దూరాన్ని 4 సార్లు పెంచారు.

ఆగస్టు 4: చంద్రయాన్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌ భూమి ఫొటోను తీసి పంపించింది.

ఆగస్టు 6: ఐదోసారి భూకక్ష్య దూరాన్ని పెంచారు.

ఆగస్టు 14: చంద్రయాన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుడి బదిలీ కక్ష్యలోకి పంపించారు.

ఆగస్టు 20: చంద్రయాన్‌ను 114 కిలోమీటర్ల పెరీజీ, 18,072 అపోజీలో చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఆగస్టు 21-సెప్టెంబరు 1: వివిధ దశల్లో చంద్రుడి కక్ష్య దూరాన్ని 5 సార్లు తగ్గించారు.

ఆగస్టు 22: చంద్రయాన్‌ జాబిల్లికి 2,650 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఫొటో తీసి పంపించింది

సెప్టెంబరు 2: 96 కిలోమీర్ల పెరీజీ, 125 కిలోమీటర్ల అపోజీ కక్ష్యలో విక్రమ్‌ ల్యాండర్‌ను ఆర్బిటార్‌ నుంచి వేరుచేశారు. ఆర్బిటార్‌ తన జీవిత కాలమంతా ఇదే కక్ష్యలో తిరుగుతుంది.

సెప్టెంబరు 3, 4: చంద్రుడి కక్ష్యను క్రమంగా తగ్గిస్తూ ల్యాండర్‌ను చంద్రుడికి చేరువగా తీసుకెళ్లారు.

సెప్టెంబరు7: విక్రమ్‌ ల్యాండింగ్‌పై బిగ్ స‌స్పెన్స్‌.

విక్రమ్‌ ల్యాండింగ్‌పై బిగ్ స‌స్పెన్స్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts