మెగా బాట‌లో ప‌వ‌ర్‌స్టార్‌…!!

September 10, 2019 at 3:22 pm

అన్న‌మో మోగాస్టార్.. త‌మ్ముడెమో ప‌వ‌ర్‌స్టార్‌.. అయితే అన్న మెగాస్టార్‌గా చిరస్థాయిగా నిలిచారు.. కానీ ప‌వ‌ర్‌స్టార్ మాత్రం ఇప్పుడు ప‌వ‌ర్‌లేకుండా గ‌డుపుతున్నాడు.. మ‌రి అన్న మెగాస్టార్‌గా నిలుస్తున్న‌ప్పుడు త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్‌గా నిలిచిపోతే బాగుంటుంది క‌దా అని స‌గ‌టు అభిమానుల ఆవేధ‌న‌, ఆశ కూడా. మ‌రి ప‌వ‌ర్‌స్టార్ మెగాస్టార్ బాట‌లో న‌డుస్తాడ‌నే ప్ర‌చారం మాత్రం సిని ప‌రిశ్ర‌మ‌లో జోరుగా సాగుతుంది. ఇంత‌కు మెగాస్టార్ బాట‌లో ప‌వ‌ర్‌స్టార్ న‌డుస్తున్న‌ది ఎందులో..

మెగాస్టార్ చిరంజీవి సిని జీవితం ప్రారంభించిన అందులో మెగాస్టార్‌గా ఎదిగి అక్క‌డి నుంచి దిశ మార్చుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అక్క‌డ కూడా స్టార్ లీడ‌ర్‌గా మారి… త‌రువాత ద‌శ మార్చుకుని సిని రంగంలో స్థిర‌ప‌డ్డాడు.. ప్ర‌స్తుతం చిరంజీవి రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి, సిని రంగంలో రాణిస్తూ త‌న వృత్తిని ప్రేమిస్తున్నాడు.. వృత్తిలోనే జీవిస్తున్నాడు.. అందుకే మెగాస్టార్‌గానే నిలిచిపోతున్నాడు…

అయితే త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం సినిమాల్లో ప‌వ‌ర్‌స్టార్‌గా రాణించి త‌న దిశ‌ను మార్చుకుని రాజ‌కీయ రంగంలో అడుగుపెట్టాడు.. అయితే సినిమాల్లో త‌న న‌ట‌న‌తో ప‌వ‌ర్ చూపించి ప‌వ‌ర్‌స్టార్‌గా మారిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల్లో మాత్రం ప‌వ‌ర్‌లేని నాయ‌కుడిగా మిగిలిపోయారు. అయితే రాజ‌కీయ రంగంలో ప‌వ‌ర్ కోసం పోరాడాలంటే మ‌రో ఐదేండ్లు ఆగాల్సిందే.. అయితే ఇప్పుడు సినిమాల్లో ప‌వ‌ర్‌స్టార్‌గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో మ‌ళ్ళీ న‌టించిన ప‌వ‌ర్‌స్టార్‌గా నిలిచిపోతాడో.. లేక అటు రాజ‌కీయాల్లో ఇటు సినిమాల్లో ప‌వ‌ర్ లేని స్టార్‌గానే మిగిలిపోతాడో వేచి చూడాలి మ‌రి…

మెగా బాట‌లో ప‌వ‌ర్‌స్టార్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts