ద‌గ్గుబాటి దారెటు..?

September 5, 2019 at 10:21 am

వైసీపీలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇమ‌డ‌లేక‌పోతున్నారా..? ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ద‌గ్గ‌బాటి మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. కొద్దిరోజులుగా ద‌గ్గుబాటి కొంచెం అసంతృప్తితో ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు అధికార వైసీపీలో ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న కుమారుడు హితేష్ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఇక ఆయ‌న భార్య పురందేశ్వ‌రేమో బీజేపీలో కొన‌సాగుతున్నారు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్‌లు వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. నిజానికి.. ద‌గ్గుబాటికి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇష్టం లేద‌ట‌. హితేష్‌ను ప‌ర్చూరు నుంచి పోటీ చేయించాల‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల హితేష్‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావే ప‌ర్చూరు నుంచిపోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు.

అయితే.. ఆయ‌న‌పై పార్టీ అధిష్టానానికి కొన్ని ఫిర్యాదులు అందిన‌ట్లు తెలుస్తోంది. ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అంద‌రినీ క‌లుపుకుపోవ‌డం లేదంటూ ప‌లువురు ఫిర్యాదు చేయ‌డంతో అధిష్టానం కూడా దగ్గుబాటి పోక‌డ‌పై నిఘా ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్‌, ద‌గ్గుబాటి మ‌ధ్య కాస్త గ్యాప్ కూడా పెరిగిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం ఏపీలో అధికార వైసీపీ, బీజేపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పాగా వేయాల‌ని క‌మ‌ల‌ద‌ళం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

బీజేపీలో కొన‌సాగుతున్న పురందేశ్వ‌రి కూడా ప‌లుమార్లు వైసీపీ ప్ర‌భుత్వాన్ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఇలా భ‌ర్తేమో అధికార పార్టీలో, భార్యేమో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో అటు బీజేపీ, ఇటు వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ద‌గ్గుబాటి కూడా ఉంటే అంద‌రం ఒక్క‌పార్టీలోనే ఉండాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగూ జ‌గ‌న్‌తో కొంత గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంది కాబ‌ట్టి.. బీజేపీలోకి వెళ్ల‌డ‌మే మంచిద‌ని ఆయ‌న అనుచ‌రులు సూచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ద‌గ్గుబాటి దారెటు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts