షాక్‌: గోదావ‌రిలో మునిగిన బోటులో ఏడుగురు తెలంగాణ పోలీసులు

September 16, 2019 at 10:52 am

తూర్పుగోదావ‌రి జిల్లా దేవీప‌ట్నం మండలం కుచ్చ‌లూరు ద‌గ్గ‌ర గోదావ‌రిలో బోటు మునిగిపోయిన సంఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా కుటుంబాల్లో తీర‌ని విషాదం నింపింది. మొత్తం బోటు సిబ్బందితో క‌లిసి 70 మంది వ‌ర‌కు బోటులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్ర‌మాదంలో గ‌ల్లంతైన వారిలో, చ‌నిపోయిన వారిలో తెలంగాణ‌కు చెందిన వారే ఎక్కువుగా ఉన్నారు. అది కూడా వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాకు చెందిన వారే 15 మంది వ‌ర‌కు ఉన్నారు. వీరంతా ఓకే ప్రాంతానికి చెందిన వారు కావ‌డంతో ఆ ప్రాంతంలో తీర‌ని విషాదం అలుముకుంది.

ఇక పర్యాట‌కుల పూర్తి వివ‌రాలు లేకుండానే చాలా మందిని బోటులోకి ఎక్కించుకోవడంతో గ‌ల్లంతైన వారు, మృతి చెందిన వారు ఎవరు.? ఐడెంటి ఏంటి? అన్న ఆధారాలు కూడా తీసుకోలేదు. దీంతో బతికి బయటపడ్డ వారి నుంచే ఎవరు గల్లంతయ్యారన్నది తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ ప్ర‌మాదంలో మ‌రో షాకింగ్ విష‌యం కూడా బ‌య‌ట ప‌డింది. ఈ బోటులో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రయాణించారని తెలిసింది.

పోలీసు హౌసింగ్ కార్పొరేష‌న్‌లో ఏఈలుగా ప‌ని చేస్తోన్న ఏడుగురు ఇంజ‌నీర్స్‌డే సంద‌ర్భంగా సెల‌వు పెట్టి మ‌రీ పాపికొండ‌ల టూర్‌కు వెళ్లార‌ట‌. వీరిలో ప్ర‌స్తుతం న‌లుగురు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌గా… మ‌రో ముగ్గురు మాత్రం గ‌ల్లంత‌య్యారు. తెలంగాణ పోలీస్ శాఖ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం గల్లంతైన పోలీసులు హేమంత్ (వరంగల్) – తరుణ్ రెడ్డి (నల్గొండ) – సురభి రవీందర్ (హైదరాబాద్)లుగా గుర్తించారు. ఇక ప్రాణాలతో రాజేశ్ – సురేష్ – కిరణ్ కుమార్ – శివకుమార్ బతికి బయటపడ్డారు.

షాక్‌: గోదావ‌రిలో మునిగిన బోటులో ఏడుగురు తెలంగాణ పోలీసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts