హౌస్‌ఫుల్ 4 ట్రైల‌ర్…!

September 27, 2019 at 4:30 pm

టాలీవుడ్ హీరో రానా న‌టిస్తున్న చిత్రం హౌస్‌ఫుల్ 4 చిత్రం ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బాలీవుడ్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నాడు. 1419, 2017 ల మధ్య కాలంలో సాగే కథాంశంతో వినోదాత్మకంగా సినిమాను రూపొందించాడు ద‌ర్శ‌కుడు. హౌస్‌ఫుల్ చిత్రం సిరీస్‌ను 2010లో ప్రారంభించారు.

ఈ సిరీస్‌లో భాగంగా తెర‌కెక్కిన ఈ చిత్రం నాలుగోది. అయితే ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ ఫిలిమ్స్‌, సాజిద్ న‌డియావాలా గ్రాండ్ స‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రాన్ని ఫ‌ర్హాద్ సామ్జి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈసినిమా ట్రైల‌ర్‌లో రానా ద‌గ్గుబాటిని చూస్తే ఓ భారీ రాక్ష‌సుడిని చూసిన అనుభూతి క‌లుగుతుంది. భ‌యం గొల్పే పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి న‌టించి మెప్పించిన‌ట్లుగా అనిపిస్తుంది.

మూడు ప్రేమ జంటల మధ్య రెండు భిన్న కాలాలలో జరిగే గజిబిజి గందర గోళంమే హౌస్ ఫుల్4 చిత్రం అని అర్థం అవుతుంది. రాజుల కాలంలో జైన్ట్ మోన్స్టర్ పాత్రలో రానా ద‌గ్గుబాటి న‌టించాడు. హౌస్ ఫుల్ సక్సెస్ సిరీస్ లో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,కృతి సనన్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

హౌస్‌ఫుల్ 4 ట్రైల‌ర్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts