జక్కంపూడిపై రాజకీయ కుట్ర … భూమి పత్రాలు,కోర్ట్ ఉత్తర్వలు బయటపెట్టిన రాజా

September 10, 2019 at 6:06 pm

తన ఫ్యామిలీ టార్గెట్‌గా తనపై రాజకీయాలు చేస్తుంటే సహించనని రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా హెచ్చరించారు. కొద్దిరోజులుగా తాను కోనసీమలోని రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని విశ్వేశ్వరాయపురం గ్రామంలో భూ కబ్జా చేసినట్లు కోనసీమకు చెందిన కొందరు కిరాయి మనుషులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని… తనను రాజకీయంగా బ‌ద్నాఆం చేసేందుకు ఫ్లెక్సీలు పెట్టి మరి అల్లరి చేస్తున్నారని… భూ కబ్జా చేశారన్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని రాజా చెప్పారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలపై ఆయన వివరణ ఇస్తూ 1957లో తన తాత కొమ్ముల చక్రపాణి 18.50 ఎకరాల భూమిని శాస్త్రి అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశారని..అలా తాత నుంచి త‌న తల్లి విజ‌య‌ల‌క్ష్మికి ప‌సుపు – కుంకుమ కింద 1984లో 1.70 ఎక‌రా ఇచ్చార‌ని తెలిపారు.

ఆ భూమిని తాము 1994లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు విక్ర‌యించామ‌ని తెలిపారు. ఇక మొత్తం 18.50 ఎక‌రాల భూమిని ప‌లుసార్లు అమ్మగా ప్ర‌స్తుతం అక్క‌డ 1.23 ఎక‌రా మాత్ర‌మే ఉంద‌ని… జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న ఆ భూమి విష‌యంలో కొంద‌రు కోర్టుకు వెళ్లార‌ని ఆయ‌న తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న తాత‌కు చెందిన భూమిని కాపాడుకునే క్ర‌మంలో త‌న మేన‌మామ భూమి వ‌ద్ద‌కు వెళితే కొంద‌రు దాడికి పాల్ప‌డిన సంగ‌తి కూడా రాజా చెప్పారు. ఈ దాడికి సంబంధించిన వ్య‌క్తుల‌పై మ‌ల్కీపురం పోలీస్‌స్టేష‌న్లో ఇప్ప‌టికే మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోద‌య్యాయ‌న్నారు.

ఈ విష‌యంలో త‌న మేన‌మామ రాజోలు కోర్టులో ఫిల్ వేసి ఇంజెక్ష‌న్ ఆర్డ‌ర్‌తో భూమిలోకి వెళ్లినా కూడా దాడి చేశార‌ని రాజా తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వ్య‌క్తులు ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్నార‌ని స్ప‌స్టం చేశారు. ప్ర‌జాజీవితంలో ఉన్నంత మాత్రాన తాము త‌మ కుటుంబ స‌భ్యుల‌కు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అని కూడా రాజా హెచ్చ‌రించారు. ఇటీవ‌ల తాను త‌న త‌మ్ముడు గ‌ణేష్ ఆ గ్రామానికి వెళితే కొంద‌రు కిరాయి మ‌నుషులు వైసీపీపై బుర‌ద చ‌ల్లేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని.. అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు సైతం ఫిర్యాదు చేయ‌డంతో పాటు కోన‌సీమ‌లో ఫ్లెక్సీలు క‌ట్టి అల్ల‌రి చేస్తున్నార‌ని.. త‌న కుటుంబంపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయాల‌నుకుంటే చూస్తూ ఊరుకోన‌ని వారిని త‌గిన గుణ‌పాఠం చెపుతాన‌ని రాజా హెచ్చ‌రించారు.

జక్కంపూడిపై రాజకీయ కుట్ర … భూమి పత్రాలు,కోర్ట్ ఉత్తర్వలు బయటపెట్టిన రాజా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts